తెలివి మీరిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్.. మార్చి నెలలో రూటు మార్చేశారు..!

తెలివి మీరిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్.. మార్చి నెలలో రూటు మార్చేశారు..!
  • మార్చిలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు 

న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్‌లు) లో ఇన్ఫో ఈ ఏడాది మార్చిలో 11 నెలల కనిష్ట స్థాయి రూ.25,082 కోట్లకు తగ్గింది. టారిఫ్ ఆందోళనల కారణంగా మార్కెట్ పడుతూనే ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈక్విటీ ఫండ్లలో ఇన్ఫోలో  తగ్గుదల వరుసగా ఇది మూడవ నెల. ఫిబ్రవరి నుంచి ఇన్ఫోలో 14 శాతం తగ్గుదల కనిపించింది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సిప్) ఇన్లు మార్చిలో రూ. 25,925 కోట్లుగా నమోదయ్యాయి. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. ఫిబ్రవరిలో సిప్ ఇన్ రూ.25,999 కోట్లు, జనవరిలో రూ. 26,400 కోట్లు, డిసెంబర్లో రూ. 26,459 కోట్లుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవ త్సరంలో నెలవారీ సిప్ సగటు కంట్రిబ్యూషన్ రూ. 24,113 కోట్లకు చేరుకుంది. ఇది మునుపటి ఆర్థిక సం వత్సరంలో రూ. 16,602 కోట్లు ఉంది.

 ఏడాది లెక్కన భారీగా పెరిగింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం, ఈక్విటీ ఆధారిత ఎంఎఫ్లు మార్చిలో రూ. 25,082 కోట్ల ఇన్ ను సాధించాయి. ఇవి ఫిబ్రవరిలో వచ్చిన రూ.29,303 కోట్ల కంటే చాలా తక్కువ. ఈ విషయమై ఐటీఐ మ్యూచువల్ ఫండ్ సీఈఓ జతీందర్ పాల్ సింగ్ మాట్లాడుతూ ఇన్ఫోలు తగ్గడానికి సెక్టోరల్ థీమాటిక్ ఫండ్లలో అధిక ఉప సంహరణలు కారణమని అన్నారు. గతంలో బలమైన పెట్టుబడులు కనిపించిన సెక్టోరల్ థీమాటిక్ ఫండ్లలో పెట్టుబడులు గణనీయంగా తగ్గడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ విశ్లేషకుడు, రీసెర్చ్ మేనేజర్ నేహల్ మేషామ్ అన్నారు..

ఫ్లెక్సీ క్యాప్కు ఎక్కువ ఆదరణ

ఈక్విటీ ఫండ్స్ కేటగిరీలో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లు మార్చిలో అత్యధికంగా రూ. 5,165 కోట్లను ఆకర్షించాయి. సెక్టోరల్ / థీమాటిక్ ఫండ్లలో ఫిబ్రవరిలో రూ. 5.711 కోట్ల బలమైన ఇన్ఫోలో ఉండగా, మార్చిలో కేవలం రూ. 735 కోట్లు మాత్రమే వచ్చాయి. పెట్టుబడిదారుల సెంటిమెంట్లో మార్పే ఈ తగ్గుదలకు కారణమని ఎనలిస్టు లు అంటున్నారు. గత నెలలో మిద్క్యాప్, స్మాల్క్యప్ మ్యూచువల్ ఫండ్లు వరుసగా రూ.3.439 కోట్లు, రూ. 4,092 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఫిబ్రవరి లో మిద్క్యాప్లకు రూ.3,406 కోట్లు, స్మాల్క్యస్ల కు రూ.3,722 కోట్లు వచ్చాయి. లార్డ్ క్యాప్ ఫండ్స్ ఇన్ఫోలు తగ్గాయి. ఫిబ్రవరిలో రూ.2,866 కోట్లతో పోలిస్తే మార్చిలోరూ. 2,479 కోట్లకు పడిపోయాయి. మార్కెట్లలో ఒడిదుడుకుల వల్ల ఇన్స్టాలు తగ్గాయని యూనియన్ ఏఎంసీ సీఈఓ మధు నాయర్ అన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ ఆధారిత ఫండ్లలో కి మొత్తంగా రూ.4.17 లక్షల కోట్లు వచ్చాయి. 2024 ఆర్ధిక సంవత్సరంలో నమోదైన రూ.1.84 లక్షల కోట్ల కంటే ఇవి చాలా ఎక్కువ. డెట్ ఫండ్ల ఔట్ ఫ్లో విలువ ఫిబ్రవరిలో రూ.6,525 కోట్లు కాగా, మార్చిలో రూ. 2.02 లక్షల కోట్ల ఉపసంహరణ జరిగింది. 

మార్చిలో అన్ని 16 డెట్ ఫండ్ కేటగిరీల్లో ఉపసంహరణలు కని పించాయి. లిక్విడ్ ఫండ్లలో అత్యధికంగా రూ. 1.33 లక్షల కోట్ల ఉపసంహరణ జరిగింది. ఈ నెల మొత్తం ఉపసంహరణలో ఇవి 65.64 శాతం. ఓవర్నైట్ ఫండ్లలో రూ.30,015 కోట్ల ఉపసంహరణలు, మనీ మార్కెట్ ఫండ్లలో రూ.21,301 కోట్ల నికర ఉపసం హరణలు జరిగాయి. ఈటీఎఫ్ లలోకి ఫిబ్రవరిలో రూ. 1,980 కోట్లు రాగా, గత నెలలో రూ.77 కోట్ల ఉపసం హరణలు జరిగాయి. మొత్తంమీద, ఫిబ్రవరిలో ఎంఎఫ్ లలోకి రూ. 40 వేల కోట్ల ఇన్ఫో ఉండగా, రూ.1.64 లక్షల కోట్లను పెట్టుబడిదారులు వెనక్కి తీసుకున్నారు. పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ మార్చి చివరి నాటికి రూ.65.7 లక్షల కోట్లకు స్వల్పంగా పెరిగాయి. గతనెలలో రూ.64.53 లక్షల కోట్లుగా ఉన్న ఈ ఆస్తులు మార్చి చివరినాటికి రూ.65.7లక్షల కోట్లకు చేరాయి.