ఎవరి ఇంటి ముందు చెత్త ఉంటే వారిదే బాధ్యత

ఎవరి ఇంటి ముందు చెత్త ఉంటే వారే బాధ్యత వహించాలన్నారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఓపెన్ ప్లాట్లలో చెత్తవేస్తే…యజమానికి ఐదువేల జరిమానా వేయాలని అధికారులను ఆదేశించారు. కమర్షియల్ ఏరియాల్లో రోడ్లపై చెత్తవేస్తే…కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా…వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో పర్యటించారు మంత్రి. అధికారులు, స్థానిక నేతలతో కలిసి వీధుల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. మురుగు కాల్వలు, పందుల సమస్యపై చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి.