మానుకోట సభను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలి : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు, సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌

  • మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు, సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌
  • సీఎం బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌/కరీమాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఈ నెల27న మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్న సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ బహిరంగ సభను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు, సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌ పిలుపునిచ్చారు. శనిగపురం రోడ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్న బహిరంగ సభా స్థలం, హెలీప్యాడ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే శంకర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ అంగోత్‌‌‌‌‌‌‌‌ బిందుతో కలిసి పరిశీలించారు. అనంతరం జరిగిన ముఖ్యనాయకుల సమావేశంలో మంత్రి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడారు. రాహుల్‌‌‌‌‌‌‌‌ సభకు జనాలు రాకపోవడంతో రోడ్‌‌‌‌‌‌‌‌షోలతో కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలనలో సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మేనిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు.

పీసీసీ ఛీఫ్‌‌‌‌‌‌‌‌ రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఓ చీటర్‌‌‌‌‌‌‌‌ అని అన్నారు. ప్రజలంతా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌దేనన్నారు. కాంగ్రెస్, బీజేపీకి క్యాండిడేట్లే దొరకడం లేదని ఎద్దేవా చేశారు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌ను మరోసారి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పాల్వాయి రామ్మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బీరెల్లి భరత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మార్నేని వెంకన్న పాల్గొన్నారు.

అనంతరం సద్దుల బతుకమ్మ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌కు చీరను బహూకరించారు. అలాగే వర్ధన్నపేట నియోజకవర్గంలోని భట్టుపల్లిలో జరగనున్న సభ కోసం ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ కాలేజీ పక్కన ఉండే స్థలాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌‌‌‌‌‌‌‌తో కలిసి పరిశీలించి, పలు సూచనలు చేశారు.

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరికలు

రాయపర్తి, వెలుగు : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కేశవాపురం జగ్యా తండాకు చెందిన పలువురు ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు సమక్షంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ బిల్లా సుధీర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పూస మధు పాల్గొన్నారు.