రేవంత్ రెడ్డి నీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసా: ఎర్రబెల్లి దయాకర్ రావు

వరంగల్ లో జరుగుతున్న బీఆర్ఎస్  దీక్షాదివాస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, కేసిఆర్ మళ్ళీ సిఎం కాబోతున్నారని..పార్టీ శ్రేణులు, ప్రజలు అధైర్య పడొద్దని అన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎర్రబెల్లి.రేవంత్ రెడ్డి నీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసా అంటూ ఎద్దేవా చేశారు.

వెయ్యి మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్న బలి దేవత సోనియాగాంధీ అని, రేవంత్ రెడ్డికి సిగ్గులేదని..  సోనియాగాంధీని నాడు బలి దేవతన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు దేవత అంటున్నాడని మండిపడ్డారు ఎర్రబెల్లి. 

 

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ చేసిన ఘనత కేసిఆర్ ది అని.. కాంగ్రెస్ కు ఓటువేసిన ప్రజలంతా తప్పు చేశామని భావిస్తున్నారని అన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. 

Also Read:-సంగారెడ్డిలో బ్రిడ్జిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు