
హనుమకొండ సిటీ, వెలుగు : పరిపాలనా సౌలభ్యం కోసమే పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ల పునర్ వ్యవస్థీకరణ చేపట్టామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. వరంగల్ జడ్పీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన పీఆర్ చీఫ్ ఇంజినీరింగ్ టెరిటోరియల్, సూపరింటెండెంట్ ఇంజినీరింగ్, క్వాలిటీ కంట్రోల్ కంట్రోల్ ఆఫీస్‌లను సోమవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఆఫీస్‌ల ఏర్పాటు వల్ల కొత్తగా 740 మంది ఉద్యోగాలు, అనేక మందికి ప్రమోషన్లు వస్తాయన్నారు.
రాష్ట్రంలో మొత్తం 237 ఇంజినీరింగ్ ఆఫీసులు ఉండగా మిషన్ భగీరథ, పల్లె ప్రగతితో పంచాయతీ రాజ్ కార్యకలాపాలు విస్తరించడంతో కొత్త ఆఫీస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, పీఆర్ ఇంజినీరింగ్ సీఈ సీతారాములు, పీఆర్ ఎస్‌ఈ రఘువీరారెడ్డి, ఈఈ శంకరయ్య పాల్గొన్నారు.