పాలకుర్తి, వెలుగు : వచ్చే నెల 4న సీఎం కేసీఆర్ వల్మిడి టూర్‌కు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, వివిధ శాఖల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
విగ్రహ ప్రతిష్ఠాపనకు చిన్న జీయర్ స్వామితో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరవుతారన్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆఫీసర్లు కో ఆర్డినేషన్‌తో పనిచేయాలని సూచించారు. అనంతరం పార్కింగ్, హెలిప్యాడ్, వివిధ కార్యక్రమాలు నిర్వహించే ప్లేస్‌లను పరిశీలించారు. సమావేశంలో ఆర్డీవో రామ్మూర్తి, డీఆర్డీవో రాంరెడ్డి, జడ్పీ సీఈవో అనిల్‌కుమార్, కాంట్రాక్టర్ నరసింహారెడ్డి, డీఎంహెచ్‌వో ప్రశాంత్, డీఏవో వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన లీడర్లు
తొర్రూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని అన్నారం రోడ్డులో బేడ బుడగ జంగాల ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఎకరా భూమి, రూ.కోటి కేటాయించినందున ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, కౌన్సిలర్లు తూర్పాటి సంగీత రవి, పేర్ల యమున జంపన్న, బేడ బుడగ జంగాల నాయకులు బుధవారం హనుమకొండలో మంత్రిని దయాకర్‌రావును కలిశారు. మంత్రిని కలిసిన వారిలో ఏఎంసీ డైరెక్టర్ అల్లం అర్జున్‌రాజ్, అమ్మాపురం సర్పంచ్ కడెం యాకయ్య, నాయకులు కిన్నెర పాండు, చార్ల కృష్ణ, గంధం గోపాల్ ఉన్నారు.