ఎర్రబెల్లి కాన్వాయ్ లోని కారు బోల్తా : ఇద్దరు మృతి.. ముగ్గురికి గాయాలు

వరంగల్ , వెలుగు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ లోని ఓ వాహనం పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం చీటూరు గ్రామ సమీపంలో అర్థరాత్రి మంత్రి కారు వెనకాల వస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. మృతులు డ్రైవర్ పార్థసారధి, సోషల్ మీడియా ఇంచార్జి పూర్ణగా గుర్తించారు.
వాహనంలో ప్రయాణిస్తున్న గన్ మెన్ నరేశ్, అటెండర్ తాతారావు, శివలకు గాయాలయ్యాయి. వారిని జనగామ అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రి దయాకర్ రావు ఆస్పత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు.

మరిన్ని వార్తల కోసం