పర్వతగిరి, వెలుగు : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు బుధవారం పర్వతగిరిలో మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నరసింహనాయక్, జడ్పీటీసీ రంగు కుమార్, సర్పంచ్ స్వామి, నాయకులు సుధీర్‌రెడ్డి, దొమ్మాటి సుభాశ్, చిప్ప శ్రీను, శంకరయ్య, పాలెపు శ్రీనివాస్, ప్రసాద్, సంపత్ పాల్గొన్నారు.