పొలం దున్ని, నాటేసిన మంత్రి ఎర్రబెల్లి 

రాష్ట్రానికి మంత్రైనా రైతు బిడ్డే అని నిరూపించుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్వగ్రామం పర్వతగిరిలోని తన పొలాన్ని చూసేందుకు వెళ్లిన ఆయన రైతు కూలీలతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. మహిళా కూలీలతో కలిసి నారు సిద్ధం చేశారు. ఆ తర్వాత పొలంలోకి దిగి గొర్రు పట్టారు. పొలం పనుల్లో ఉత్సాహంగా పాల్గొని రైతు కూలీలతో కాసేపు ముచ్చటించారు.