ఇతర పార్టీల పైసలు తీసుకోండి.. ఓటు మాత్రం బీజేపీకే వేయండి : ఎర్రబెల్లి ప్రదీప్‌‌‌‌రావు

 వరంగల్‌‌‌‌ సిటీ, వెలుగు : ఇతర పార్టీలు ఇచ్చే పైసలు తీసుకోండి, ప్రమాణం చేయమంటే చేయండి కానీ ఓటు మాత్రం బీజేపీకే వేయండి’ అని వరంగల్‌‌‌‌ తూర్పు బీజేపీ క్యాండిడేట్‌‌‌‌ ఎర్రబెల్లి ప్రదీప్‌‌‌‌రావు పిలుపునిచ్చారు. నగరంలోని 26వ డివిజన్‌‌‌‌లో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్‌‌‌‌రావు మాట్లాడుతూ భూములు కాపాడుకోవాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, కష్టాలు పోవాలన్నా కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలన్నారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ లీడర్లు ఇన్ని రోజులు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. రోజు రోజుకు బీజేపీ బలపడుతోందని, కాంగ్రెస్, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు తూర్పులో మనుగడ లేదన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ లీడర్లకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలకు ఓటు వేస్తే రౌడీయిజం పెరిగిపోతుందని, సామాన్యులకు రక్షణ లేకుండా పోతుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్న బీజేపీకే ఓటు వేయాలని కోరారు. అలాగే ప్రదీప్‌‌‌‌రావు భార్య ఎర్రబెల్లి రేణుక వరంగల్‌‌‌‌ నగరంలోని 32 డివిజన్‌‌‌‌లో ప్రచారం నిర్వహించారు.