వరంగల్సిటీ, వెలుగు : వరంగల్ తూర్పులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు చెప్పారు. మంగళవారం వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేటకు చెందిన సుమారు 200 మంది యువకులు రాజు యాదవ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి ఆ పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ రాజకీయ మార్పు కోసం తూర్పు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.
అనంతరం వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ లో ఆయన ప్రచారం చేశారు. తన ఏకైక లక్ష్యం ప్రజల కష్టాలు తీర్చటం, నియోజకవర్గాన్ని అభివద్ధి చేయడమేనన్నారు. ఇన్ని ఏండ్లుగా నియోజకవర్గ ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానానికి, ప్రేమకు రుణపడి ఉంటానని చెప్పారు.
ALSO READ : అర్హలందరికీ దళితబంధు అందేలా చూస్తా : కందాల ఉపేందర్ రెడ్డి