నిరుద్యోగ యువత కోసమే జాబ్‌‌మేళా : ఎర్రబెల్లి ప్రదీప్‌‌రావు

కాశీబుగ్గ, వెలుగు : నిరుద్యోగ యువత కోసమే జాబ్‌‌మేళా నిర్వహించినట్లు బీజేపీ స్టేట్‌‌ లీడర్‌‌ ఎర్రబెల్లి ప్రదీప్‌‌రావు చెప్పారు. ఎర్రబెల్లి ప్రదీప్‌‌రావు ఛారిటబుల్‌‌ ట్రస్ట్‌‌ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌‌ దేశాయిపేటలోని ఒయాసిస్‌‌ పబ్లిక్‌‌ స్కూల్‌‌లో మెగా జాబ్‌‌మేళా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎర్రబెల్లి ప్రదీప్‌‌రావు, మాజీ మేయర్‌‌ రాజేశ్వర్‌‌రావు, వరంగల్‌‌ ఛాంబర్‌‌ ప్రెసిండెంట్‌‌ బొమ్మినేని రవీందర్‌‌రెడ్డి, ఒయాసిసి స్కూల్‌‌ చైర్మన్‌‌ జన్ను పరంజ్యోతి ప్రారంభించారు.

సుమారుగా 85కు పైగా జాబ్‌‌మేళాకు హాజరుకాగా నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రదీప్‌‌రావు మాట్లాడుతూ అంది వచ్చిన అవకాశాలను యువత వినియోగించుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ట్రస్ట్​ చైర్మన్‌‌ ఎర్రబెల్లి వినిత్, డాక్టర్‌‌ విజయచందర్‌‌రెడ్డి, కాళీప్రసాద్‌‌, అఖిల్‌‌ రాంనాయక్‌‌, శ్రీరామనాయక్‌‌ పాల్గొన్నారు.