భార్యాభర్తల ఎమోషన్‌‌తో ఎర్రచీర

భార్యాభర్తల ఎమోషన్‌‌తో ఎర్రచీర

సుమన్ బాబు హీరోగా నటిస్తూ, దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. కారుణ్య చౌదరి హీరోయిన్.  నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ముఖ్య పాత్ర పోషిస్తోంది.  డిసెంబర్ 20న సినిమా రిలీజ్ కానుంది. గురువారం ఈ  చిత్రం నుంచి  ‘తొలిముద్దు’ అనే పాటను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి అతిథిగా హాజరైన  దర్శకుడు వీర శంకర్  సినిమా విజయం సాధించాలని విష్ చేశారు. సుమన్ బాబు మాట్లాడుతూ ‘హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్‌‌తో కూడిన ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. 

ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్‌‌లో భార్యాభర్తల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉండాలని భావించాం. మా ఆలోచనకు తగినట్లే జయసూర్య మంచి లిరిక్స్ ఇచ్చారు. అలాగే ప్రమోద్ ఆకట్టుకునేలా కంపోజ్ చేశారు. 

ఈ పాటలో సెట్ వర్క్ ఆకర్షణగా నిలుస్తుంది’ అని చెప్పాడు. ఈ కథలో మదర్ సెంటిమెంట్ ఆకట్టుకునేలా ఉంటుందని హీరోయిన్ కారుణ్య చౌదరి చెప్పింది. సంగీత దర్శకుడు ప్రమోద్, లిరిక్ రైటర్ జయసూర్య కార్యక్రమంలో పాల్గొన్నారు.