భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో తుదిదశకు ఏరు ఫెస్టివల్ ఏర్పాట్లు : ఐటీడీఏ పీవో రాహుల్​

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో తుదిదశకు ఏరు ఫెస్టివల్ ఏర్పాట్లు  : ఐటీడీఏ పీవో రాహుల్​
  • ఐటీడీఏ పీవో రాహుల్​ 

భద్రాచలం, వెలుగు : ఈనెల 9,10,11 తేదీల్లో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నిర్వహించే ఏరు ఫెస్టివల్​ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని ఐటీడీఏ పీవో బి.రాహుల్​తెలిపారు. గోదావరి కరకట్ట ప్రాంతంలో చేపడుతున్న ఫెస్టివల్ పనులను శనివారం ఆయన తనిఖీ చేశారు. గుడారాలు, ఆదివాసీల వంటలతో కూడిన డైనింగ్​ రూం, స్టాల్స్, గోదావరిలో టూరిస్టులు ప్రయాణించే బోటు భద్రతను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూరిస్టులకు అన్ని రకాల వసతి సౌకర్యాలు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. 

గుడారాలతో కూడిన విడిదికి సోలార్​ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. టూరిస్టులు గోదావరి అందాలతో సెల్ఫీ దిగే పాయింట్​ నిర్మాణ పనులను చూశారు. కల్చరల్ ప్రోగ్రాంలు నిర్వహించే వేదికను ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు. వైటీసీలో స్టాల్స్ ఏర్పాట్లపై డిజైనర్​తో కలిసి చర్చించారు. ఆదివాసీ మహిళా సంఘాలతో స్టాల్స్ నిర్వహించాల్సిన తీరుపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్​డీవో విద్యాచందన, డీఎం జీసీసీ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.