- తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి
బషీర్ బాగ్, వెలుగు: ఎరుకల జాతిని సీఎం రాష్ట్ర రేవంత్ రెడ్డి దత్తత తీసుకోవాలని, ఏకలవ్య కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగాలని రాష్ట్ర ఆదివాసీ ఎరుకల సంఘం కమిటీ విజ్ఞప్తి చేసింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు లోకిని రాజు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎరుకల జనాభా ఉండగా.. విద్య,ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థికంగా రాజకీయంగా వెనకబాటుకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ జాతిని గుర్తించి అభివృద్ధికి ప్రత్యేకంగా ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ లో రూ. 500 కోట్లు కేటాయించాలని కోరారు.