శ్రుతి ఫులారి ప్రధానపాత్రలో శ్రీధర్ బాణాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్కేప్’. పలు కేటగిరీస్‌లో ఇప్పటికే ముప్పై వరకూ జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో హీరోయిన్ శ్రుతి మాట్లాడుతూ
‘ఇలాంటి ఓ కంటెంట్ ఉన్న సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవడం, అందులోనూ సింగిల్ క్యారక్టర్ మూవీలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌కు థ్యాంక్స్’ అని చెప్పింది. దర్శకుడు మాట్లాడుతూ ‘కొత్త తరహా విధానాలతో కేవలం పది రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. త్వరలో ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నాం. విడుదలకు ముందే అవార్డులను అందుకోవడం హ్యపీ’ అన్నారు. ‘ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది’ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గౌతం కుమార్ చెప్పారు.