ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు

ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్​ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్లను అధికారులు అలాట్ చేశారు. ఫస్ట్ ఫేజ్​లో మొత్తం 8982 మందికి సీట్లు కేటాయించారు.   ఇంజినీరింగ్ స్ర్టీమ్ లో 8951 మంది ఉండగా, ఫార్మసీ స్ర్టీమ్ లో 31 మంది ఉన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 169 ఇంజినీరింగ్ కాలేజీల్లో 12785 సీట్లు ఉండగా, వాటిలో 8951 (70%) నిండాయి. 121 ఫార్మసీ కాలేజీల్లో 1180 సీట్లు ఉంటే, దాంట్లో కేవలం 31 (2.6%) మాత్రమే కేటాయించారు. ఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ లో 12703 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చినా.. 3773 మందికి సీట్లు అలాట్ కాలేదు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 21లోగా సెల్ఫ్ రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు.