షూటింగ్లో భారత్కు మరో సిల్వర్

ఏషియన్ గేమ్స్లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే 13 పతకాలు సాధించిన ఇండియన్ షూటర్లు.. తాజాగా మరో సిల్వర్ మెడల్ ను సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ లో ఇషా, దివ్య, పాలక్లు వెండి పతకం సాధించారు. 

ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటర్ ఈషా సింగ్ తన జట్టుకు రజత పతకాన్ని అందించింది. చైనా స్వర్ణం కైవసం చేసుకోగా, చైనీస్ తైపీ కాంస్యం సాధించింది. ఈషా కూడా ఐదో స్థానంలో నిలిచి వ్యక్తిగత ఫైనల్‌కు అర్హత సాధించింది. 

‘‘10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల టీమ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించిన దివ్య తాడిగోల్, ఈషా సింగ్ , పాలక్‌లకు అభినందనలు. వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు. వారి విజయం రాబోయే పలువురు క్రీడాకారులకు ప్రేరణనిస్తుంది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.