ఈఎస్‌ఐ ఆసుపత్రిలో అత్యాచారానికి పాల్పడ్డ యువకుడి అరెస్ట్‌

ఈఎస్‌ఐ ఆసుపత్రిలో అత్యాచారానికి పాల్పడ్డ యువకుడి అరెస్ట్‌

ఈఎస్ఐ ఆసుపత్రిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడుని పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రిలో రోగి సోదరిపై షాబాద్ అనే యువకుడు ఆదివారం(సెప్టెంబర్ 17) అత్యాచారానికి పాల్పడ్డాడు. లిఫ్టులో బలవంతంగా పైకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. 

దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏస్అర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూడు రోజుల నుంచి పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్నారు. సోదరుడి చికిత్స కోసం కర్ణాటక నుంచి ఈఎస్ఐ ఆసుపత్రికి బాలిక వచ్చింది.

ALSO READ: 

శుక్రవారం(సెప్టెంబర్ 15) రాత్రి ఆమెను నమ్మించి సెకండ్ ఫ్లోర్​లోకి తీసుకెళ్లాడు. ఆమెను బెదిరించి తాను చెప్పినట్లు వినకపోతే చంపేస్తానని నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని హాస్పిటల్ సిబ్బందికి చెప్పింది. డాక్టర్లు అక్కడే బాధితురాలికి వైద్య పరీక్షలు చేశారు.  

అత్యాచారం జరిగినట్లు నిర్ధారించి ఎస్ఆర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు బాధితురాలి స్టేట్‌‌‌‌మెంట్ రికార్డ్ చేశారు. కేసు ఫైల్ చేసి నిందితుడు అజయ్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు.