గుడ్ న్యూస్ : జస్ట్ ఇంటర్వ్యూతో జాబ్..నెలకు రూ. 78 వేల జీతం

గుడ్ న్యూస్ : జస్ట్ ఇంటర్వ్యూతో జాబ్..నెలకు రూ. 78 వేల జీతం

స్పెషలిస్ట్ గ్రేడ్–2 పోస్టుల భర్తీకి ఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు మే 26వ తేదీలోగా ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య:  558
పోస్టులు: స్పెషలిస్ట్ గ్రేడ్–2 (సీనియర్ స్కేల్) 155. స్పెషలిస్ట్ గ్రేడ్–2(జూనియర్ స్కేల్) 403.
ల సంఖ్య 57: స్టెనోగ్రాఫర్ గ్రేడ్–1
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్, ఎండీ, ఎంసీహెచ్, డీఎం, డీఏ, ఎంఎస్సీ, పీహెచ్ డీ, డీపీఎంలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 2025, మే 26వ తేదీ నాటికి 45 ఏండ్లు మించకూడదు. 
జీతం: స్పెషలిస్ట్ గ్రేడ్–2 (సీనియర్ స్కేల్)కు నెలకు రూ.78,000, స్పెషలిస్ట్ గ్రేడ్-2(జూనియర్ స్కేల్)కు నెలకు రూ.67,700 చెల్లిస్తారు.
అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. 
లాస్ట్ డేట్: మే 26.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా. 

ఆర్ఆర్ఐలో  ట్రైనీ ఇంజినీర్ ఖాళీలు 

 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి బెంగళూరులోని రామన్ రీసెర్చ్​ ఇ​న్​స్టిట్యూట్(ఆర్ఆర్ఐ) అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు మే 9వ తేదీలోపు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 
పోస్టుల సంఖ్య: ట్రైనీ ఇంజినీర్ 13.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్(ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణతతోపాటు పని అనుభం ఉండాలి. 2025, మే 9వ తేదీ నాటికి 23 ఏండ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: మే 9.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా.