సిచ్యుయేషన్ ఏదైనా చాకచక్యంగా సాగిపోవడం కొందరికే సాధ్యం. నరసింహన్ అలాంటికొందరిలో ఒకరు. పదేళ్ల క్రితం ఉమ్మడిఆంధ్రప్రదేశ్ కి గవర్నర్ గా వచ్చారు. తెలంగాణ గవర్నర్ గా వెళ్లిపోతున్నారు. ఈ పదేళ్లలోనూ అయిదుగురుసీఎంలతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్తో రెండుసార్లు ప్రమాణం చేయించారు కాబట్టి,మొత్తంగా ఆరు ప్రభుత్వాలకు హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ గా వ్యవహరించినట్లు లెక్కించాలి. రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ , చంద్రబాబునాయుడు,జగన్ మోహన్ రెడ్డిలలో చంద్రబాబు మినహా మిగతావారంతా మొదటిసారి ముఖ్యమంత్రులైనవారే!నరసింహన్ తన పదవీకాలంలో తెలుగునాట మొత్తం అయిదు దశలు చూడడం మరో చెప్పుకోదగ్గ విషయం.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా…
- రాష్ట్ర విభజనకు సాక్షిగా…
- రాష్ట్రపతి పాలన టైములో గవర్నర్ గా…
- తెలంగాణ, ఏపీలకు ఉమ్మడి గవర్నర్ గా…
- తెలంగాణకు మాత్రమే గవర్నర్ గా…
నరసింహన్ గవర్నర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి వచ్చే నాటికి మలిదశ తెలంగాణ ఉద్యమం బాగా వేడెక్కి ఉంది. ఆయన చాలా నేర్పుగా, ఓర్పుగా బాధ్యతలునిర్వహించారు. కరవమంటే కప్పకు, విడువమంటేపాముకు కోపం వచ్చే సందర్భాలవి. అయినా, నరసింహన్ ఎక్కడా కంగారు పడకుండా, తొణక్కుండా బెణక్కుండా వ్యవహరించారు. నాలుగున్నరేళ్లు పూర్తిగా ఉద్యమం వేడిలో తెలంగాణ రగిలిపోయింది. ఆ సమయంలో ముఖ్యమంత్రులు రోశయ్య కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఉద్యమ నేతలుకావచ్చు.,.. ఎవరికైనా అపాయింట్ మెంట్ ఇచ్చి వారుచెప్పింది ఓపిగ్గా వినేవారు. రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నర్ హోదాలో ఏపీ స్టేట్ సిచ్యుయేషన్ ని బాగా డీల్చేశారు.2014నాటికి రాష్ట్ర విభజన ఖాయమయ్యాక, కిరణ్కుమార్ రెడ్డి తప్పుకోవడంతో… నరసింహన్ సిఫార్సుతో రాష్ట్రపతి పాలన విధించారు. 2014 మార్చి ఒకటో తేదీ నుంచి ఎన్నికలు పూర్తయి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఏర్పడేవరకు 92 రోజులపాటు నరసింహన్ లీడర్ షిప్ లోనే ఉమ్మడి ఆంధప్రదేశ్ కొ నసాగింది.ఆ సమయంలో లా అండ్ ఆర్డర్ పూర్తి కంట్రోల్ లోఉండడమే కాకుండా, చాలా స్ట్రిక్ట్ గా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్స్ కూడా పనిచేశాయని చాలామంది గుర్తు చేసుకుంటారు. అడ్మినిస్ట్రేషన్ , పోలీసు యంత్రాంగాలతో ప్రెసిడెన్షియల్ రూల్ ని నడిపించారు. జూన్ 2నమొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ ప్రమాణం చేశాక తన బాధ్యతలను ఆయనకుయ అప్పగించేశారు. ఇంత చేసినా ఎక్కడా సొంత పబ్లిసిటీకి పాకులాడకపోవడం నరసింహన్ లో మె చ్చుకోదగ్గ విషయమని ఎనలిస్టులు అంటారు.
టెన్షన్ల మధ్యే కొలువు
నిజానికి, టెన్షన్ల మధ్య డ్యూటీ చేయడమనేది నరసింహన్ కు కొ త్త కాదు. 23 ఏళ్ల వయసులో ఆయనమొట్టమొదటిసారి యూనిఫాం సర్వీసులో చేరే నాటికి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి బాగోలేదు. తెలంగాణ తొలి ఉద్యమానికి సన్నా హాలు సాగుతున్నా యి. అలాంటి సమయంలో నరసింహన్ కర్నూలు జిల్లా నంద్యా లలో పోస్టింగ్ తీసుకున్నారు. తెలంగాణను ఆనుకుని ఉన్న జిల్లా కావడంతో ఉద్యమకాలం నాటి టెన్షన్కర్నూలుపై పడేది. ఆ సమయంలోనే ఆయనకు యా క్సిడెంట్ కూడా జరిగింది. సీనియర్ ఐపీఎస్ హెచ్.జె.దొర శ్రద్ధ తీసుకోవడంతో కోలుకున్నారు. తర్వాతిపోస్టింగ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సం పేటలో.ఆ సమయానికి తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. ఉద్యమ ఖిల్లా ఓరుగల్లులో విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు. రాజకీయంగా కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలతో తెలంగాణలో ఉద్యమం సద్దుమణిగింది., ఆ వేడి కాస్తా ఆంధ్రా వైపుమళ్లింది. అక్కడ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం మొదలైంది. ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి స్థానంలో పీవీ నరసింహారావు వచ్చారు. నరసింహన్ తెలంగాణ నుంచి ఏపీలోని ఒంగోలుకు ట్రాన్స్ ఫర్ అయ్యారు. జైఆంధ్రా ఉద్యమ వేడిలో కొంతకాలం పనిచేశాక… ఇంటెలిజెన్స్ బ్యూరోకి బదిలీ అయి ఢిల్లీకి వెళ్లిపోయారు.మొత్తంగా ఆయన ఉద్యోగకాలం, పదవీకాలం చూస్తే… అనేక వత్తిడులతోనే సాగిందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా, తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్ గా తొమ్మిదేళ్ల ఏడు నెలలు చేయడమనేది చాలా విశేషం. అంతకుముందు చత్తీస్ గఢ్ లో పనిచేసిన కాలాన్ని కూడా లెక్కిస్తే మొత్తం మీద 12 ఏళ్ల ఏడు నెలలు గవర్నర్ గా కొనసాగారు. ఇంత సుదీర్ఘకాలం గవర్నర్గా పనిచేసిన రికార్డు ఎవరికీ లేదు. పైగా, పొలిటికల్గా పూర్తి డిఫరెంట్ ఐడియాలజీతో ఉండే ప్రభుత్వాలు సైతం నరసింహన్ విషయంలో ఎలాంటి వ్యతిరేకతను చూపించకపోవడం మరో విశేషం. మన్మోహన్సింగ్ ప్రభుత్వం నరసింహన్ ని చత్తీస్ గఢ్ కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి గవర్నర్ గా పంపించింది., ఆ తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ సర్కారు కూడా ఆయననే కొనసాగించింది. సెంట్రల్ లో సర్కారు మారితే వేటు పడేది గవర్నర్లపైనే. అయినప్పటికీ నరసింహన్ ని కంటిన్యూ చేయడాన్నిబట్టి… ఆయన తన బాధ్యతలను ఎంత నిక్కచ్చిగా నిర్వహించారనేది చెప్పకనే చెబుతుంది
భక్తుడిగా..
నరసింహన్ కు దైవభక్తి ఎక్కువ. తరచు గుళ్లకు వెళ్తుంటారు. తిరుమలకు నెలకు కనీసం ఒకసారైనావెళ్లి, స్వా మివారిని దర్శించుకుంటారు. చిన్నప్పటినుంచే ఆయనలో భక్తి భావం ఉండేది. వాళ్లింటినుంచి స్కూల్ కు వెళ్లే దారిలో ఓ గుడి ఉండేది.తరచూ ఆ ఆలయానికి వెళ్తుండేవారు నరసింహన్.అలాగే హనుమాన్ అంటే ఆయన కు చాలా ఇష్టం .హనుమంతుడి ధైర్యం, స్వామి భక్తి నరసింహన్ ను ఆకట్టుకున్నాయి. శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శప్రాయం కావాలంటారాయన.
ఏపీ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ ..
నరసింహన్ తమిళనాడులో 1945లో పుట్టారు.ఆయన పూర్తి పేరు ఎక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీనరసింహన్. చిన్నప్పడు మన హైదరాబాద్ లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో రెండేళ్లు చదివారు.తరువాత సొంత రాష్ట్రమైన తమిళనాడు వెళ్లి చదువు కంటిన్యూ చేశారు.అక్కడి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ మెయిన్ సబ్జెక్ట్ గా చదివి గోల్డ్ మెడల్ కొట్టా రు. తర్వాత మద్రాస్లా కాలేజీలో ఎల్ ఎల్ బీ పూర్తి చేశారు. 1968 లోఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ కేడర్ కేటాయించారు. ఏపీలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. 1981 నుంచి 1984 వరకుమాస్కో లోని ఇండియా ఎంబసీలో పనిచేశారు.ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పోస్టులో ఉంటూ 2006డిసెంబర్ లో నరసింహన్ రిటైర్ అయ్యారు.
తెలుగులోనే మాట్లాడతారు.
.నరసింహన్ కు తెలుగు బాగా వచ్చు. ఐపీఎస్ఆఫీసర్ గా ఏపీ కేడర్ లో పనిచేయడంతో తెలుగుపై పట్టు సాధించారు. ఎలాంటి తడబాటు లేకుండాచక్కటి తెలుగులో మాట్లాడతారు. 2017 లో హైద-రాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పూర్తిగా తెలుగులోనే మాట్లాడారు.
సందర్భానికి తగ్గట్టు డ్రస్సు ..
సందర్భానికి తగ్గట్టు డ్రస్సు వేసుకోవడంలో నరసిం-హన్ ఎక్స్ పర్ట్ . గవర్నర్ గా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు నీట్ గా టక్ చేసుకుంటారు.ఢిల్లీ టూర్ కు వెళ్లినప్పుడు సూట్ లో కనిపిస్తా రు.తిరుమల లేదా మరేదైనా గుడికి వెళ్లినప్పుడు పంచెకట్టుకుంటారు. గవర్నర్ అనే భేషజానికి పోకుండాభక్తు డిలాగానే చొక్కా లేకుండా కనిపిస్తారు.
రెండు రాష్ట్రాల్లోనూ జెండా ఎగరేసేవారు..
నరసింహన్ శారీరకంగా చాలా ఫిట్. రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నరుగా ఆయన ఉన్నప్పుడు ఆయనపనిచేసిన తీరు ఇందుకు ఉదాహరణ. ఆగస్టు 15 వంటి జాతీయ పండుగలు వచ్చినప్పుడు ఇక్కడహైదరాబాద్ లో జెం డా ఎగరవేసి వెం టనే హెలికాప్టర్ లో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి అక్కడ కూడా జెం డాఎగరేసేవారు.అధికారిక కార్యక్రమాలు పాల్గొనేవారు. ఎక్కడా అలసిపోయినట్టు కనిపించేవారు కాదు.
ఫస్ట్ సెక్రటరీగా మాస్కోలో..
నరసింహన్ స్వదేశంతోపాటు విదేశాల్లోనూ సేవలు అందించారు. రెండుసార్లు విదేశీ వ్యవహారాలమినిస్ట్రీలో సెక్యూ రిటీ సర్వీసు చేశారు. మొదటిసారి 1981 నుంచి 84 వరకు మాస్కోలోని ఇండియన్ఎంబసీలో ఫస్ట్ సె క్రటరీగా పనిచేసి… ఎంబసీ భద్రత, సిబ్బంది సెక్యూ రిటీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ వంటిబాధ్యతలు నిర్వహించారు. రెండోసారి 1996 నుంచి 99 వరకు ఫారిన్ మినిస్ట్రీలో పనిచేసినప్పుడుప్రపంచవ్యాప్తంగాగల ఇండియన్ ఎంబసీల భద్రత విషయాలు చూశారు. అక్కడి ఆఫీసులు, సిబ్బందిసెక్యూ రిటీపై బాధ్యత వహించారు. ఆయన పెద్దన్న కూడా ఐపీఎస్ ఆఫీసరే , అస్సాంలో కేడర్ లో పనిచేసేవారు. నరసింహన్ మాస్కోలో ఉండగా ఆయన పెద్దన్న వేర్పాటు వాదుల బాంబు దాడిలో చనిపోయారు.
ఎట్ హోమ్ కార్యక్రమానికి గుర్తింపు
రాజ్ భవన్ లో జరిగే ఎట్ హోం కార్యక్రమానికి ప్రజల్లో ఒక గుర్తింపు తీసుకువచ్చింది నరసింహనే. రెండుతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎట్ హోం కార్యక్రమానికి ఆహ్వానించి, ఇద్దరిని పక్కపక్కన కూర్చో పెట్టుకుని వారితో నవ్వుతూ మాట్లాడుతుండటం అప్పట్లో అందరినీ అట్రాక్ట్ చేసేది. విభజన తర్వాతసహజంగా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య గంభీరమైన వాతావరణం ఉంటుందని అందరూ భావిస్తా రు.ఎట్ హోం కార్యక్రమాన్ని చూసినవారికి అలాంటి వాతావరణం లేదన్న విషయం అర్థమయ్యేలా చేసేవారు.
రెస్ట్ అంటే ఎలర్జీ!
సాధారణంగా ఎవరైనా కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. నరసింహన్ కి డ్యూటీలో ఉండే మజారెస్ట్ లో ఉండదంటారు. 1945లో పుట్టిన నరసింహన్ 23 ఏళ్లకే 1968లో ఐపీఎస్ కి సె లక్టయ్యారు.ఏపీ క్యా డర్ కిం ద ఆయన కొంతకాలం నంద్యాల,నర్సం పేట, ఒంగోలులో పనిచేశారు. ఆ తర్వాత1972లో ఇంటెలిజెన్స్ బ్యూరోకి వెళ్లిపోయారు.యూనిఫాంలో 38 ఏళ్లపాటు సే వలందిం చారు.2006 డిసెంబర్ 31నాడు రిటైరయ్యారు. కనీసం నెల్లాళ్లయినా రిటైర్మెంట్ లైఫ్ గడపకుండానే ఛత్తీస్గఢ్ కి గవర్నర్ గా 2007 జనవరి 25న అప్పటిమన్మోహన్ సర్కారు పంపించింది. మూడేళ్లపాటు (2009 డిసెంబర్ 27 వరకు) అక్కడ బాధ్యతలునిర్వహించాక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గాబదిలీ అయ్యారు. రాష్ట్రం రెండుగా విడిపోయినతర్వాతకూడా ఆయన తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకుఉమ్మడి గవర్నర్ గా తొమ్మిదిన్నరేళ్లపాటు సే వలుఅందిం చారు. మొత్తంగా చూస్తే 23వ ఈడులోఐపీఎస్ సర్వీసులో చేరిన నరసింహన్ 38 ఏళ్లు ఐపీఎస్ గా, 12 ఏళ్ల ఎనిమిది నెలలు గవర్నర్ గాబాధ్యతల బరువుతోనే గడిపారు.
మధ్యతరగతి నిరాడంబరం
దాదాపుగా 51 ఏళ్లపాటు అధికార హోదాలోగడిపిన వ్యక్తి కి ఉండే ఆడంబరంగానీ, అహంకారంగానీ మచ్చుకైనా లేని వ్యక్తి నరసింహన్ . ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో అధికారిగా ఉండే రోజుల్లో…రాత్రి భోజనం అయ్యాక భార్య విమలతో కలిసివాకింగ్ కి వెళ్లేవారట. ఆ సమయంలో ఇద్దరం క లిసి ఐస్ క్రీమ్ తినేవాళ్లమని సన్నిహి తులతో,రాజ్ భవన్ ఉద్యోగులతో తరచు చెప్పేవారట. గవర్నర్ గా ఏ రాష్ట్రంలో పనిచేసినా రాజ్ భవన్ కి వచ్చినసీఎం, మంత్రులు, చీఫ్ సె క్రటరీ తదితరులెవరినైనాస్వయంగా రిసీవ్ చేసుకోవడం, వీడ్కోలు పలకడం వంటివి చేసేవారు. వాళ్ల అధికార హోదాతోగానీ,తన సీ నియారిటీతోగానీ సంబంధం లేకుండాఎలాంటి భేషజాలు లేకుండా ప్రవర్తిం చేవారు.మొట్టమొదటిసారి కలిసినవాళ్లతోనైనా చిరకాలపరిచయం ఉన్నం త చనువుగా కలిసిపోవడం నరసింహన్ దంపతులకు అలవాటు. ఆ కలుపుగోలుతనం వల్లనే తెలంగాణ ఉద్యమ కాలంలో గవర్నర్ గా వచ్చి, రాష్ట్రం విడిపోయినా ఉమ్మడిగవర్నర్ గా కొ నసాగారు. ఒకప్పుడు రాజ్ భవన్కేంద్రానికి సమాచార కేంద్రంగా ఉండేదని, అక్కడిసీఎంలతో స్నేహం ఉండకపోయేదని, నరసింహన్ హయాంలో గవర్నర్ ఆఫీసుని అందరికీ దగ్గరచేసిందని చెబుతారు.
స్వీట్లు… సినిమాలు
నరసింహన్ చాలా ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటారు.తెల్లారుజామున నాలుగు గంటలకే లేచి; వాకింగ్ ,యోగ, పూజ వంటివి ముగించు కుని, దగ్గరలోనిఖైరతాబాద్ ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ప్రదక్షిణలు చేయడం, టంచన్ గా ఉదయం 10.30 కల్లా రాజ్ భవన్ లోని తన ఆఫీసుకి రావడం ఆయన అలవాటు. ఆయన భోజనంలో కచ్చితంగా స్వీట్లు,దక్షిణాది వంటకాలు ఉండేలా చూసుకుంటారు.గులాబ్ జామూన్ అంటే మహా ఇష్టంగా తింటారట.అలాగే, సినిమాలన్నా ఇష్టమే. చిరంజీవి నటించిన150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ని, ప్రభాస్ ‘బాహుబలి’ని చూసి తెగ మె చ్చుకున్నా రని రాజ్ భవన్ఉద్యోగులు గుర్తు చేసుకుంటారు. వీలయితే బయటిథియేటర్లకు వెళ్లడం, లేదంటే స్పె షల్ షోలు వేయించుకుని చూడడంవంటివి చేసేవారట. తొలిరోజుల్లో బ్యా చ్ లర్ గా ఉన్నప్పుడుకూడా సినిమాలు తెగ చూసేవాణ్ణని సిబ్బందితో చెప్పేవారు.
పిల్లల్నీ అలాగే పెంచారు
నరసింహన్, విమల దంపతులకు ఇద్దరుకొడుకులు. వాళ్లకు పెళ్లిళ్లయి, ఎవరి లైఫ్ వాళ్లు గడుపుతున్నారు. రాజ్ భవన్ కి చు ట్టపుచూపుగాపిల్లలు, మనవలు వస్తే… వాళ్లను తప్పనిసరిగాఅక్కడి క్వా ర్టర్లకు పంపించి అందరినీ పలకరించి రమ్మని పంపేవారు. రాజ్ భవన్ ఉద్యోగులపిల్లలకోసం పెట్టిన స్కూలుపైకూడా చాలా శ్రద్ధచూపించేవారు . ఆయన మనవరాళ్లుకూడాస్కూలుకి వెళ్లి, అక్కడి పి ల్లలకు పాఠం చెప్పడం లే దా వాళ్లతో ఇంటరాక్ట్ అవడం వంటివిచేసేవారు.
యాక్సిడెంట్ తో కోమాలోకి..
ఐపీఎస్ అయిన తొలి రోజుల్లో నరసింహన్ కుకర్నూలు జిల్లా నంద్యాలలో పోస్టిం గ్ వచ్చింది.అప్పటికాయనకు పెళ్లి కాలేదు. పొరుగు జిల్లా అనంతపురంలో హెచ్ .జె.దొర పనిచేస్తున్నా రు.ఆ సమయంలో నరసింహన్ కి యాక్సిడెం ట్అయి, కోమాలోకి వెళ్లిపోయారు. ఆయనకంటేసీనియరైన దొర వెం టనే స్పందించి, నరసింహ-న్ కి మంచి వైద్యం అందేలా జాగ్రత్తలు తీసుకు-న్నా రట! ‘నాకు అది పునర్జన్మతో సమానం’ అనినరసింహన్ చెప్పుకునేవా
రాజ్ భవన్ సిబ్బందికి అపార్టుమెంట్లు
గవర్నర్ విశాలమైన రాజ్ భవన్ లోగడుపుతుంటారు. ఆయన సిబ్బంది మాత్రం ఇరుకిరుకు క్వార్టర్లలో ఉంటారు.నరసింహన్ ఈ పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టారు.రాజ్ భవన్ లో పనిచేసే తోటమాలి మొదలుకొని, డ్రైవర్ , అటెండర్ వరకు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు, ఆఫీసర్లకు త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ప్రత్యేకంగా కట్టించారు. దీనికొక కారణం కూడా చెప్పారట. ‘ఢిల్లీలో ఎంపీలు, మంత్రులకుమంచి మంచి క్వార్టర్లుంటాయి. గవర్నమెంట్అధికార్లకు మాత్రం సాదాసీదా క్వార్టర్లుఇస్తారు. నేను సర్వీసులో ఉండగా మాఇంటికి ఎవరైనా బంధువులొస్తే ఇబ్బందిగాఉండేది. మా పిల్లలిద్దరినీ వేరేవాళ్ల ఇళ్లకుపంపిం చి, బంధువులకు చోటుకల్పిం చేవాళ్లం . అందుకే నా సిబ్బందికిఅలాంటి ఇబ్బంది ఉండకూడదన్నఉద్దేశంతోనే అపార్టుమెంట్లు కట్టిం చాను’అన్నారట!