
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలని కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హబీబ్ డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ పట్టణంలో ముస్లింలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం దాతలు ఇచ్చిన భూములను బడాబాబులకు కట్టబెట్టేందుకే బిల్లు తీసుకువచ్చారని ఆరోపించారు.
కల్వకుర్తి, వెలుగు: వక్ఫ్ భూములను పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లు తీసుకువచ్చిందని వక్ఫ్ బచావో కల్వకుర్తి నియోజకవర్గ కో–ఆర్డినేటర్లు సయ్యద్ మసూద్, షేక్ ఏజాస్, జహీర్,అబ్దుల్ ఖాదర్, మోక్తదర్ ఆరోపించారు. శుక్రవారం ముస్లింలతో కలిసి కల్వకుర్తి పట్టణంలోని జామా మసీదు నుంచి మహబూబ్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు.
లింగాల, వెలుగు: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు శుక్రవారం లింగాల మండల కేంద్రంలోని జామా మసీదు ఆవరణలో నిరసన తెలిపారు. మసీదు కమిటీ అధ్యక్షుడు ఇస్మాయిల్, నాయకులు పాల్గొన్నారు.