ఎస్సార్ గ్రూప్ సంస్థల అధినేత శశికాంత్ రుయా కన్నుమూత..

ఎస్సార్ గ్రూప్ సంస్థల అధినేత శశికాంత్ రుయా కన్నుమూత..

ఎస్సార్ గ్రూప్ సంస్థల కో ఫౌండర్ శశికాంత్ రుయా కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 81ఏళ్ళ వయసులో మరణించారు. సోమవారం ( నవంబర్ 25, 2024 ) అర్థరాత్రి ముంబైలో మరణించారు శశికాంత్ రుయా. ఆయనకు భార్య మంజు, ఇద్దరు కుమారులు ప్రశాంత్, అన్షుమన్ లు ఉన్నారు. శశికాంత్ సోదరుడు రవితో కలిసి ఎస్సార్‌ను ఎస్సార్ గ్రూప్ సంస్థలను స్థాపించారు. అనారోగ్యంతో అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రుయా నెలరోజుల క్రితం అమెరికా నుండి తిరిగి వచ్చారు. 

మంగళవారం ( నవంబర్ 26, 2024 ) మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు ఆయన భౌతికకాయాన్ని రుయా హౌస్‌లో ఉంచనున్నారు. సాయంత్రం 4 గంటలకు రుయా హౌస్ నుండి హిందూ వర్లీ శ్మశానవాటిక వైపు అంతిమ యాత్ర ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ప్రధాని మోడీ నివాళి: 

రుయా మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు.శశికాంత్ రుయా పారిశ్రామిక ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి అని, ఆయన విజనరీ లీడర్షిప్, కమిట్మెంట్ భారతదేశ వ్యాపార రంగాన్ని మార్చివేసిందని అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.

 1969 లో అతను తన సోదరుడు రవితో కలిసి 1969లో చెన్నై ఓడరేవులో ఔటర్ బ్రేక్‌వాటర్‌ను నిర్మించడం ద్వారా ఎస్సార్‌కు పునాది వేశారు. ఎస్సార్ సంతలు ఉక్కు, ఆయిల్ రిఫైనింగ్, టెలికాం, పవర్, నిర్మాణంతో సహా వివిధ రంగాలలోకి విస్తరించింది.