గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైడ్రోజన్ తయారీకి ఎస్సార్ రూ.30 వేల కోట్ల పెట్టుబడి

గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైడ్రోజన్ తయారీకి ఎస్సార్ రూ.30 వేల కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెట్టేందుకు వచ్చే నాలుగేళ్లలో రూ.30 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని  ఎస్సార్ గ్రూప్ ప్రకటించింది. మెటల్స్ నుంచి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ వరకు వివిధ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఉన్న ఈ గ్రూప్ క్లీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టింది.  సౌది  అరేబియాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, యూకేలోని ఆయిల్ రిఫైనరీలో డీకార్బనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేపడతామని ఎస్సార్ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. 

అలానే దేశంలో ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచుతామని, ఎలక్ట్రిక్ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరుస్తామని తెలిపింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీల్లో వాడే మినరల్స్ మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అవ్వాలని ఈ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. ఎస్సార్ ఫ్యూచర్ ఎనర్జీ ఒక గిగా వాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైడ్రోజన్ తయారీ కెపాసిటీ ఉన్న ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించాలని చూస్తోంది. దీంతో పాటు గ్రీన్ మాలుక్యుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారీ కెపాసిటీ ఏడాదికి మిలియన్ టన్నులున్న ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఏర్పాటు చేయనుంది.