
హైదరాబాద్, వెలుగు: ప్రీమియం కళ్లద్దాల బ్రాండ్ ఎస్సిలార్ ట్రాన్సిషన్ జెన్ఎస్ లెన్సులను ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టింది. అల్ట్రా- రెస్పాన్సివ్ లైట్ అడాప్టేషన్ వల్ల అద్దాలు సెకన్లలో చీకటిగా మారుతాయి.
రెండు నిమిషాలలోపు తిరిగి మసకబారుతాయి. వేగంగా కాంతి మారినప్పటికీ కస్టమర్లు గుర్తించలేరని ఎస్సిలార్ తెలిపింది. బయట ఉన్నా, ఇంటి లోపల ఉన్నా ధరించడానికి అనువుగా ఉంటాయని పేర్కొంది. ట్రాన్సిషన్ జెన్ఎస్ లెన్సులు యూవీఏ, యూవీబీ కిరణాలను, బ్లూలైట్ను ఫిల్టర్ చేస్తూ కళ్లను కాపాడుతాయని తెలిపింది. వీటి ధరలు రూ.8,900 నుంచి మొదలవుతాయని పేర్కొంది.