ధర్మారం మండలం సమ్మక్క జాతరలో బోర్​వెల్​ ఏర్పాటు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో కొలువైన సమ్మక్క–సారలమ్మ జాతరలో కాకా ఫౌండేషన్​ ఆధ్వర్యంలో బోర్​వెల్​ ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయించాలని పెద్దపల్లి మాజీ ఎంపీ, చెన్నూర్​ ఎమ్మెల్యే డాక్టర్​వివేక్​ వెంకటస్వామిని ఇటీవల జాతర కమిటీ కోరారు. స్పందించిన ఆయన కాకా ఫౌండేషన్ ద్వారా గురువారం బోర్​వేయించారు. 

కార్యక్రమంలో సభ్యులు కాడే సూర్యనారాయణ, ఉత్సవ కమిటీ కన్వీనర్ మేడవేణి తిరుపతి, ట్రెజరర్​ ఓరెం చిరంజీవి, మాజీ వీఎస్ఎస్​ చైర్మన్ దేవి జనార్ధన్, దేవి రాజలింగయ్య, రాజేశం, రాజేశం, మల్లేశం పాల్గొన్నారు