కామారెడ్డి, వెలుగు: జిల్లాలో కందుల కొనుగోలుకు ఐదు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. బుధవారం కందుల కొనుగోళ్లపై ఆఫీసర్లతో ఆయన మాట్లాడుతూ.. మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, గాంధారి, పిట్లం మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 21 వేల హెక్టర్లలో కంది పంట సాగులో ఉందన్నారు. 10 వేల మెట్రక్ టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారు. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మీ, మార్కెటింగ్ఆఫీసర్రమ్య, డీసీవో శ్రీనివాస్‌రావు
పాల్గొన్నారు.