- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా రఘునాథఫాలెం మండలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్వామి నారాయణ ట్రస్టు ఆధ్వర్యంలో గురుకుల విద్యాలయం ఏర్పాటుకానుందని, విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందుబాటులోకి రానుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రఘునాథపాలెం మండలంలో 13.07 ఎకరాల విస్తీర్ణంలో కేజీ నుంచి 12 వ తరగతి వరకు గురుకుల విద్యాలయం నెలకొల్పడానికి మార్కెట్ ధరకు భూమిని కేటాయించినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డికి గురువారం మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
స్వామి నారాయణ గురుకుల ట్రస్ట్ భారతీయ సంస్కృతి ప్రతిభింబించే విధంగా ఉంటుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు పక్కనే ఉన్న జిల్లాల్లోని 500 మంది విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందుతుందని అభిప్రాయపడ్డారు. డే స్కాలర్ విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. గురుకుల విద్యాలయం ఏర్పాటుతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.