హైదరాబాద్‎లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు

హైదరాబాద్‎లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు

హైదరాబాద్‎లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. బుద్ధభవన్‎లో హైడ్రా పోలీస్ స్టేషన్‎ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ మంగళవారం (జనవరి 7) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ స్థలాలు, నాళాలు, చెరువులు, కుంటలు కబ్జా చేసిన వారిపై ఇక నుండి హైడ్రా పీఎస్‎లో కేసులు నమోదు చేయనున్నారు. హైడ్రా పీఎస్‎కు కావాల్సిన సిబ్బందిని కేటాయించాలని డీజీపీకి హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‎గా ఏసీపీ స్థాయి అధికారి ఉంటారని హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ALSO READ | మార్చి నెలాఖ‌రు వరకు మెట్రోల డీపీఆర్లు పూర్తి చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు, నాళాలు, చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైడ్రాకు ప్రత్యేకాధికారాలు కల్పించిన సర్కార్.. తాజాగా సపరేట్‎గా హైడ్రా పోలీస్ స్టేషన్‎ను ఏర్పాటు చేసింది. ఇక నుండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కబ్జా వ్యవహారాలన్నీ హైడ్రా డీల్ చేయనుంది.