మీ కోసం వస్తున్న.. గుమ్మడి అనురాధ ఫ్లెక్సీలపై రాజకీయ చర్చ

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఇల్లందులో ఫ్రొఫెసర్ గుమ్మడి అనురాధ ఫ్రెక్సీల ఏర్పాటు రాజకీయ చర్చకు దారితీసింది. మీకోసం వస్తున్న అంటూ గుమ్మడి అనురాధ పేరిట ఇల్లందు పట్టణంలో ఫ్రెక్సీలు వెలిశాయి. తాను ఏ పార్టీ నుంచి కాకుండా ఇండిపెం డెంట్ గా పోటీ చేస్తానని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రకటించిన నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల గురించే అందరూ చర్చించుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ లు.. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ఆయన కుమార్తె అయిన అనురాధను ఇల్లందు నుంచి బరిలోకి దింపాలని ప్రయత్నం చేశారు. అయితే దీనికి వారు ఒప్పుకోలేదు. అనురాధ స్వతంత్ర్య అభ్యర్థి పోటీ చేయడం పట్ల కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో గుబులు పట్టుకుంది. ఆగస్టు 27నుంచి ప్రచార కార్యచరణను ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.