హజ్ యాత్రికుల కోసం నల్లగొండలో ట్రావెల్స్ బ్రాంచ్ ఏర్పాటు

నల్లగొండ అర్బన్, వెలుగు : హజ్ యాత్రికుల కోసం నల్లగొండ పట్టణంలో మదీనా మసీదు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ అజిత్ ట్రావెల్స్ పాయింట్ ను ఆదివారం మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్​ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలు హజ్ యాత్ర (మక్కా)కు వెళ్లడానికి నల్గొండలో బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా మక్కా వెళ్లి రావాలని కోరుకుంటారని తెలిపారు. అందుకు అనుగుణంగా పట్టణంలో ట్రావెల్స్ పాయింట్ ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఆల్ అజిజ్ ట్రావెల్స్ పాయింట్ ప్రోప్రైటర్ అబ్దుల్ అజీజ్, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.