టీ20 క్రికెట్‌లో సంచలనం.. 27 బంతుల్లోనే అనామక క్రికెటర్ సెంచరీ

టీ20 క్రికెట్‌లో సంచలనం.. 27 బంతుల్లోనే అనామక క్రికెటర్ సెంచరీ

ఈస్టోనియా.. ఉత్తర ఐరోపాకు చెందిన బాల్టిక్ ప్రాంతంలోని ఒక దేశమిది. వీరు క్రికెట్ ఆడతారని బయటి ప్రపంచానికే తెలియదు. అలాంటిది ఆ జట్టు ఆటగాడు.. అగ్రశ్రేణి క్రికెటర్లు సైతం తన వైపు చూసేలా టీ20 క్రికెట్‌‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 27 బంతుల్లోనే సెంచరీ చేసి టీ20 క్రికెట్‌ చరిత్రలో వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రెకార్డుల్లోకెక్కాడు. 

ప్రస్తుతం ఈస్టోనియా- సిప్రస్‌ జట్ల మధ్య ఆరు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగుతోంది. అందులో భాగంగా సోమవారం( జూన్ 17) రెండో టీ20 జరగ్గా.. సాహిల్ చౌహాన్ ఈ ఘనత సాధించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిప్రస్ నిర్ణీత ఓవర్లలో 191 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టాఫార్డర్ విఫలమవడంతో ఈస్టోనియాకు మంచి ఆరంభం లభించలేదు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సాహిల్ చౌహాన్ ఆకాశమే హద్దన్నట్లు చెలరేగిపోయాడు. 41 బంతుల్లో 6 ఫోర్లు, 18 సిక్సర్ల సాయంతో 144 పరుగులతో నౌటౌట్‌గా నిలిచాడు. అతని ధాటికి ఈస్టోనియా 4 వికెట్లు మాత్రమే కోల్పోయి, 42 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించింది.

అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు

  • సాహిల్ చౌహాన్(ఈస్టోనియా): 27 బంతుల్లో (సిప్రస్ పై, 2024)
  • జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్(నమీబియా): 33 బంతుల్లో (నేపాల్ పై, 2024)
  • కుశాల్ మల్లా(నేపాల్): 34 బంతుల్లో (మంగోలియాపై, 2023)
  • డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా): 35 బంతుల్లో  (బంగ్లాదేశ్ పై, 2027)
  • రోహిత్ శర్మ (భారత్): 35 బంతుల్లో (శ్రీలంకపై, 2017)