ఆదిలాబాద్, వెలుగు : కిడ్నీలోని రాళ్లను ఆపరేషన్ లేకుండా లేజర్ టెక్నాలజీతో తొలగించే ఈఎస్ డబ్ల్యూఎల్ మెషీన్ ను ఆదిలాబాద్ లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు గతంలో హైదరాబాద్
నాగపూర్ వంటి మహానగరాలకు వెళ్లేవారని, వారి సమస్యలు పరిష్కరించేందుకు రూ.3 కోట్ల కేంద్రం నిధులతో రిమ్స్‌లో ఈ మెషీన్‌కు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డాక్టర్లు పాల్గొన్నారు.