మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గన్ పార్క్ లోని అమరుల స్థూపం దగ్గరికి భారీ కాన్వాయ్ తో బయల్దేరారు. శామీర్ పేటలోని ఇంటినుంచి బయలుదేరిన ఈటలకు రహదారిపై కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అల్వాల్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు ఈటల. లోతుకుంట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గన్ పార్క్ అమరుల స్థూపం దగ్గరకు పెద్దఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి.. పలువురు నేతలతో కలిసి అమరులకు నివాళులర్పించారు ఈటల రాజేందర్. కాసేపట్లో గన్ పార్క్ నుంచి బీజేపీ స్టేట్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు.