
- ప్రస్తుతం అదే బాటలో రేవంత్‌రెడ్డి సర్కార్
- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్స్
గోదావరిఖని/ హుజూరాబాద్, వెలుగు: సింగరేణి సొమ్మును ఏటీఎంలాగా వాడుకొని సంస్థ నాశనానికి మాజీ సీఎం కేసీఆర్ కారణమయ్యారని, అదే బాటలో ప్రస్తుత రేవంత్‌రెడ్డి సర్కార్నడుస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్విమర్శించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ శాలపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన సమావేశానికి ఆయన హాజరై బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో లేకుండా పోయిందన్నారు. గ్రాడ్యుయేట్స్, టీచర్ల సమస్యల పరిష్కారానికి కొట్లాడేది బీజేపీ మాత్రమేనన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే 317 జీవోను సవర్తిస్తామని, సీపీఎస్‌ను రద్దు చేస్తామని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి, రావుల రాజేందర్, బల్మూరి వనిత, మెరుగు హన్మంత్‌గౌడ్, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.