ఈసీ వికాస్ రాజ్ తో ఫోన్లో మాట్లాడిన ఈటల

ఫలితాలు వెల్లడించడంలో ఎందుకు ఆలస్యం అవుతోంది?

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫోన్ చేసి మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడించడంలో ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు.  పొరపాటు జరిగితే అది మీకే మచ్చ,మసక అవుతుందని అన్నారు.  

ఉప ఎన్నికల ప్రచారం.. పోలింగ్ సందర్భంగా జరిగిన దాడులు, మద్యం పంపిణీ, డబ్బులు పంపిణీ ఘటనలు ఎన్నికల కమిషన్ మీద చెడు అభిప్రాయం కలుగజేశాయని తెలిపారు.  ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం.. కానీ మీ మీద మచ్చ తెచ్చుకోకుండా ఉండండి అని వికాస్ రాజ్ కి సూచించారు. ఫలితాలు సక్రమంగా వెల్లడించాలని ఈటల రాజేందర్ కోరారు.