
రాష్ట్రంలో కరోనా వైరస్ భయంలేదన్నారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన… గత నెల రోజులుగా ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తుందన్నారు. చైనా నుంచి రాష్ట్రానికి వచ్చే వాళ్లకు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటిదాక చైనా నుంచి మన దేశానికి 52మంది వచ్చారని చెప్పారు. వీరిలో 27మందిని పుణెలో , మరో25 మందిని హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. కరోనా వైరస్, స్వైన్ ఫ్లూ లక్షణాలు ఒకే రకంగా ఉంటాయని ఎవరికైనా ఈ లక్షణాలుంటే వెంటనే హాస్పిటల్ లో టెస్ట్ లు చేయించుకోవాలని తెలిపారు. కరోనా వైరస్ చైనాలో పుట్టి… 26దేశాలకు వ్యాపించిందని… చైనా నుంచి వచ్చిన ముగ్గురు కెరళా వాళ్లకు వైరస్ ఉండటంతో వైద్యం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం లో ఒక ప్రత్యేక అధికారి మరియు ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. గాంధీ ఆసుపత్రి లో అన్ని ఏర్పాట్లు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. కరీంనగర్ జిల్లా సొసైటీ ఎన్నికల్లో అన్ని సొసైటీ ల పైన టిఆర్ ఎస్ జెండా ఎగురేస్తదని ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తలకోసం క్లిక్ చేయండి
అయోధ్య: రామమందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేసిన మోడీగాంధీ హాస్పిటల్ లో కరోనా టెస్టులు
అమలాపాల్ నెక్స్ట్ స్టాప్ అదే!