పీకే ఇక్కడ పనికిరాడు.. గెలిచేది బీజేపీనే

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పని ఖతం అని.. ఆయన నియంతృత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తాము ఉండకుండా చేయాలనే దురుద్దేశంతోనే సస్పెండ్ చేయించారని దుయ్యబట్టారు. కేసీఆర్ ను వదిలే ప్రసక్తే లేదని.. ఆయన్ను పీకేలు కాపాడలేరన్నారు.  

‘గవర్నర్ ను అవమానించిన చిల్లర ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన అవమానిస్తోంది గవర్నర్ ను కాదు..‌ శాసనసభ మర్యాదను అని అర్థం చేసుకోవాలి. కేసీఆర్ తో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. కేసీఆర్, హరీష్ రావుకు దమ్ముంటే బడ్జెట్ పై నాతో చర్చకు రావాలి. హరీష్ రావుది దొంగలెక్కలు.. కాకి లెక్కల బడ్జెట్అని కాగ్ నివేదిక చెప్పింది. కార్మిక సంఘాలను రద్దు చేయించిన దుర్మార్గపు సీఎం కేసీఆర్. ఆర్టీసీ, మున్సిపల్ కార్మికులను కేసీఆర్  తొలగించాలన్నప్పుడు నేను అడ్డుపడ్డా. ఎత్తేసిన ధర్నా చౌక్ లో దీక్ష చేసే స్థితికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ దీక్ష ఆరంభం మాత్రమే.  మిస్టర్ కేసీఆర్.. నీ పని ఖతం. ఈసారి గెలిచేది బీజేపీ, ఓడేది కేసీఆర్. ఇకపై పల్లెల్లో దీక్షలు పెడతాం. ప్రజల విశ్వాసం కోల్పోయారు కాబట్టే టీఆర్ఎస్ కు పీకేను తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పీకే ఇక్కడ పనికిరాడు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, చైతన్యం మాత్రమే పని చేస్తుంది. 

మరిన్ని వార్తల కోసం:

‘గని’ ట్రైలర్ వచ్చేసింది

స్వామీజీ ముసుగులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

45 రోజుల్లో ఏడంతస్తుల బిల్డింగ్ కట్టేసిన్రు