నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నిరుద్యోగ యువత కలలను కల్లలుగా చేసిన వ్యక్తి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ని పార్టీ కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేపట్టింది బీజేపీ. ఈ దీక్షలో పాల్గొన్న ఈటల... సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలపై ఫైర్ అయ్యారు. నిరుద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికల కోసమే ఉపయోగించుకుందన్నారు. వెంటనే నోటిఫికేన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో కూడా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలోనూ విఫలమైందన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేది బీజేపీయేనన్న ఈటల.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు అండగా ఉంటుందన్నారు.
అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈటల. కొందరు అధికారులు ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తుడటం సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనమని ఎప్పుడు చెప్పలేదని.. కేవలం ఉప్పుడు బియ్యం మాత్రమే కొనమని చెప్పిందన్నారు. నన్ను ఏ ప్రభుత్వం భయపెట్టలేదని చెప్పిన కేసీఆర్...కేంద్రం తన మెడ మీద కత్తి పెట్టిందని చెప్పడం సిగ్గు చేటుగా ఉందన్నారు.పేదలకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వానికి ప్రజల ఉసురు తగులుందన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ పాలన.. నీరోచక్రవర్తిని తలపిస్తోందన్నారు ఈటల. ఏడాదిలో ఎక్కువ రోజులు కేసీఆర్ం ఉండేది ఫాం హౌజ్ లోనేనని అన్నారు. కేసీఆర్ ఫాం హౌజ్ లో 150 ఎకరాల్లో సాగు అవుతోందన్నారు ఈటల.
మరిన్ని వార్తల కోసం...