కార్పొరేట్ స్థాయిలో పేదలకు వైద్యం: ఈటెల

కార్పొరేట్ స్థాయిలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. వైద్య రంగంలో ప్రజలు మెచ్చే విధంగా పని చేస్తామన్నారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లితో కలిసి వరంగల్ MGM హాస్పిటల్ ను పరిశీలించారు ఈటెల. హెల్త్ యూనివర్సిటీ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత డాక్టర్లతో సమీక్ష నిర్వహించి . హైదరాబాద్ హాస్పిటల్స్ తరహాలో MGMని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, జెడ్పీ ఛైర్మన్ సుధీర్‌కుమార్ ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు నరేందర్, వినయ్ భాస్కర్, రమేష్, రాజయ్య, సతీష్‌కుమార్, మేయర్ ప్రకాష్‌రావు, , కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.