ఎథికల్ హ్యాకింగ్

ఎథికల్ హ్యాకింగ్

వానా క్రై.. సరిగ్గా మూడేళ్ల కింద ప్రపంచవ్యాప్తంగా మారుమోగిన పేరు. టెక్నాలజీ సర్కిల్ ‌‌ ‌‌లో ఉండేవారు, నిత్యం న్యూస్ ఫాలో అయ్యేవారికి సుపరిచితమైన పేరు. 150 కి పైగా దేశాల్లో ఒకేసారి రెండు లక్షల 30 వేల కంప్యూటర్స్ ను హ్యాక్ చేసి ఎన్నో సిస్టమ్స్ కొలాప్స్ అయ్యేలా చేసిన రాన్సమ్ ‌‌ ‌‌వేర్ వైరస్ ఇది. పకడ్బందీగా కోడింగ్ రాసి సాప్ట్ ‌‌ ‌‌వేర్స్ డిజైన్ చేసినా వాటిలో ఉండే లోపాలు ఆసరాగా చేసుకొని సిస్టమ్స్ ‌‌ ‌‌లోకి చొరబడుతూ ఎక్స్ ‌‌ ‌‌పర్ట్స్ కి నిత్యం సవాలు విసురుతున్న బ్లాక్ హాట్స్ (హ్యాకర్స్) వీటిని క్రియేట్ చేసి హ్యాకింగ్ చేస్తుంటారు. ఈ బ్లాక్ హ్యాట్స్ కి చెక్ పెట్టే ప్రొఫెషనల్సే ఎథికల్ హ్యాకర్స్. టెక్నాలజీతో పాటు సమాంతరంగా విస్తరిస్తున్న సైబర్ ఇన్ ‌‌ ‌‌సెక్యూరిటీ నుంచి కంప్యూటర్ సిస్టమ్స్ ను కాపాడే ఎథికల్ హ్యాకర్స్ వివరాలు ఈ వారం కెరీర్ గైడెన్స్ ‌‌ ‌‌లో..

హ్యాకర్ ‌‌ ‌‌వన్ అనే సంస్థ నివేదిక ప్రకారం ఇంటర్నెట్ యూజర్లు ఇప్పటికే లక్షా 66 వేల రిజిస్టర్డ్ హ్యాకర్స్ తో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మార్కెట్స్ అండ్ మార్కెట్స్ అనే కంపెనీ అంచనాల ప్రకారం 2018లో 152.71 బిలియన్ డాలర్లుగా ఉన్న సైబర్ సెక్యూరిటీ మార్కెట్ 2023 నాటికి 10.2 శాతం వార్షిక వృద్ధి రేటుతో 248.6 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. నాస్కామ్ రిపోర్టు  ప్రకారం మనదేశంలో సైబర్ సెక్యూరిటీ మార్కెట్ 2025 నాటికి 35 బిలియన్ డాలర్లకు చేరుకొని దాదాపు 1 మిలియన్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ క్రియేట్ చేస్తుందని అంచనా.

ఎథికల్ హ్యాకింగ్ అంటే..

ఓనర్స్ అనుమతి లేకుండా కంప్యూటర్ సిస్టమ్స్ లేదా ప్రైవేట్ నెట్ ‌‌ ‌‌వర్క్ లోకి ఎంటరయ్యి సమాచారం తస్కరించడం, డిలీట్ చేయడం, మనీ డిమాండ్ చేయడమే హ్యాకింగ్. ఈ యాక్టివిటీస్ చేసేవారే హ్యాకర్స్. కంప్యూటర్ సాఫ్ట్ ‌‌ ‌‌వేర్ ‌‌ ‌‌, వెబ్ ‌‌ ‌‌సైట్స్, ఇతర డివైజ్ ‌‌ ‌‌లలో ఉండే బలహీనతను గుర్తించడం, సస్పెక్టెడ్ హైపర్ ‌‌ ‌‌లింక్స్ పంపడం పాస్ ‌‌ ‌‌వర్డ్స్ డీకోడ్ చేయడం, స్ర్కిప్ట్ మార్చి రాయడం వంటి చర్యల ద్వారా ఇతరుల కంప్యూటర్లోకి ప్రవేశిస్తారు.

ఎథికల్ హ్యాకింగ్ అంటే కూడా ఇతరుల కంప్యూటర్లోకి చొరబడి యాక్సెస్ సాధించడమే. అయితే ఇక్కడ ఓనర్ అనుమతి ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ తస్కరించడం లేదా డిలీట్ చేయడం ఉండదు. కేవలం సెక్యూరిటీ పర్పస్ గా సాఫ్ట్ ‌‌ ‌‌వేర్, కంప్యూటర్స్, వెబ్ ‌‌ ‌‌సైట్స్, వెబ్ ‌‌ ‌‌సర్వర్స్, వైర్ ‌‌ ‌‌లెస్ నెట్ ‌‌ ‌‌వర్క్ ‌‌ ‌‌లో ఉండే లోపాలను గుర్తించి అధికారికంగా వాటిని ఫిక్స్ చేస్తారు. వీరినే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్స్ అని పిలుస్తారు. కంపెనీలు తమ సిస్టమ్స్ ‌‌ ‌‌లో ఉండే లోపాలు గుర్తించి ఫిక్స్ చేయడంలో వీరి పాత్రే కీలకం. ఎథికల్ హ్యాకర్స్, సెక్యూరిటీ అనలిస్ట్ ‌‌ ‌‌లు ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, ఐటీ సెక్యూరిటీ వంటి టాస్క్స్ పర్ ‌‌ ‌‌ఫార్మ్ చేస్తారు.

సైబర్ సెక్యూరిటీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూల్స్ ద్వారా ఆన్ ‌‌ ‌‌లైన్ కార్యకలాపాల భద్రతను మానిటర్ చేయడం

డేటా సెక్యూరిటీ: ఆన్ ‌‌ ‌‌లైన్ డేటాకు రక్షణ కల్పించడం

అప్లికేషన్ సెక్యూరిటీ: ఒక ప్రోగ్రామ్/అప్లికేషన్ తయారీలోనే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం

ఐటీ సెక్యూరిటీ: హ్యాకింగ్ జరిగిన తర్వాత దానిని గుర్తించి ఫిక్స్ చేయడం

హ్యాకర్స్ లో బ్లాక్ హాట్స్, వైట్ హ్యాట్స్ అని రెండు రకాల వ్యక్తులుంటారు. సంస్థలు, వ్యక్తులు, సిస్టమ్స్ ను థ్రెట్ నుంచి కాపాడటం కోసం అధికారికంగా సిస్టమ్స్ హ్యాక్ చేసేవారు వైట్ హ్యాట్స్ హ్యాకర్స్ అయితే మానిటరీ బెనిఫిట్స్, స్వార్థంతో ఇతరులకు హాని తలపెట్టేందుకు బ్లాక్ హ్యాట్స్ హ్యాకర్స్ ప్రయత్నిస్తారు. గ్రే హ్యాట్స్ హ్యాకర్స్ జస్ట్ ఫన్ కోసం హ్యాక్ చేస్తుంటారు.

జాబ్ ప్రొఫైల్స్

మనదేశంలో ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కు తక్కువ వేతనాలే లభిస్తున్నాయి అని చెప్పవచ్చు. అమెరికా వంటి సాప్ట్ ‌‌ ‌‌వేర్ పుట్టినిళ్లలో ఎక్స్ ‌‌ ‌‌పీరియన్స్ కలిగిన వారికి ప్రారంభంలోనే యావరేజ్ గా 50 వేల  నుంచి లక్షా 30 వేల డాలర్ల వరకు వార్షిక వేతనాలు అందుతున్నాయి. కన్సల్టెంట్ సర్వీస్ అందించేవారికి ఆకర్షణీయ ప్యాకేజీలు లభిస్తాయి. పేస్కేల్ అనే వెబ్ ‌‌ ‌‌సైట్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ శాలరీ ట్రెండ్స్ పై సర్వే నిర్వహించి ఆయా రకాల జాబ్స్ కు అందుతున్న సరాసరి వేతనాలు అంచనా వేసింది.

రిక్వైర్డ్ స్కిల్స్

ఎథికల్ హ్యాకర్ సైబర్ సెక్యూరిటీ, డేటాబేస్ హ్యాండ్లింగ్, నెట్ ‌‌ ‌‌వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. డిఫరెంట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, లైనక్స్ ఆపరేటింగ్ నాలెడ్జ్, క్రిప్టోగ్రఫీ, డేటాబేస్ మేనేజ్​మెంట్ సిస్టమ్, నెట్ ‌‌ ‌‌వర్కింగ్, సోషల్ ఇంజినీరింగ్, నెట్ ‌‌ ‌‌వర్క్ ట్రాఫిక్ స్నిఫ్పింగ్, నెట్ ‌‌ ‌‌వర్క్ అటాక్స్ ను అంచనా వేయగలగడం, ఎస్ ‌‌ ‌‌క్యూఎల్ ఇంజెక్షన్, పాస్ ‌‌ ‌‌వర్డ్ గెస్సింగ్ అండ్ క్రాకింగ్, సెషన్ హైజాకింగ్ అండ్ స్పూఫింగ్, డీఎన్ఎస్ స్పూఫింగ్ వంటి స్కిల్స్ కలిగి ఉండాలి. ఎస్ ‌‌ ‌‌ఎంటీపీ, ఐసీఎంపీ, హెచ్ ‌‌ ‌‌టీటీపీ వంటి ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ పై అవగాహన తప్పనిసరి. – వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్

కోర్సులు

ఇంటర్ అర్హతతో ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ లో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు చదవొచ్చు. డిగ్రీస్థాయిలో లో కేవలం ఒక సబ్జెక్టు మాత్రమే అందుబాటులో ఉండగా పీజీలో ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్స్ చేయవచ్చు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర సంస్థలు ఆన్ ‌‌ ‌‌లైన్ కోర్సులు ఆఫర్ చేస్తుండగా మన రాష్ట్రంలోని పలు యూనివర్శిటీలు పీజీ స్థాయిలో ఎథికల్ హ్యకింగ్, సైబర్ సెక్యూరిటీ కోర్సులు అందిస్తున్నాయి. సిస్కో, ఈసీ కౌన్సిల్, సీడాక్ వంటి వెబ్ ‌‌ ‌‌సైట్లలో సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీలు, ఎన్ ‌‌ ‌‌ఐటీలు గేట్ ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్స్ కల్పిస్తుండగా మన వర్శిటీలు గేట్, పీజీఈసెట్ ర్యాంకుల ద్వారా ప్రవేశాలు జరుపుతాయి. వీటితో పాటు అంకిత్ ఫాడియా, కోనిగ్ సొల్యూషన్స్, ఇన్నోబజ్ నాలెడ్జ్ సొల్యూషన్స్, హ్యాకర్  స్కూల్, ఎంటర్ ‌‌ ‌‌సాఫ్ట్ ల్యాబ్స్ వంటి ప్రైవేటు ఇన్ ‌‌ ‌‌స్టిట్యూషన్స్ ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. ఎథికల్ హ్యాకింగ్ కరిక్యులమ్ ‌‌ ‌‌లో నెట్ ‌‌ ‌‌వర్క్ ప్రోటోకాల్స్, ఆర్కిటెక్చర్, నెట్ ‌‌ ‌‌వర్కింగ్ ‌‌ ‌‌ టూల్స్, టెక్నిక్స్ ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ వంటి టాపిక్స్ ప్రధానంగా ఉన్నాయి.

ఆపర్చునిటీస్

సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఎథికల్ హ్యాకర్లకు మల్టినేషనల్ సాఫ్ట్‌‌వేర్, ఐటీ కంపెనీలు, గవర్నమెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు ప్రధాన అవెన్యూలుగా నిలుస్తున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఐబీఎం వంటి  సాఫ్ట్‌‌వేర్ కంపెనీలు వీరిని నియమించుకుంటున్నాయి. మనదేశంలో సైబర్ క్రైమ్స్ పెరిగిపోతుండటంతో నేరపరిశోధన సంస్థలైన సీబీఐ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ వంటి ప్రభుత్వ సంస్థలు సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌‌పర్ట్స్ ను రిక్రూట్ చేసుకుంటున్నాయి. వీటితో పాటు లా ఎన్స్‌‌ఫోర్స్‌‌మెంట్ సంస్థలు, మిలిటరీ, డిఫెన్స్ ఆర్గనైజేషన్స్, ఫోరెన్సిక్ ల్యాబోరేటరీస్, డిటెక్టివ్ కంపెనీలు, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలకు ఈ ప్రొఫెషనల్స్ అవసరం చాలా ఏర్పడింది. ఇటీవల ఆన్‌‌లైన్ సేవలు అందించే రీటెయిల్ కంపెనీలు, ఎయిర్‌‌లైన్స్,  హాస్పిటల్స్, ఫైనాన్షియల్ ఇన్‌‌స్టిట్యూషన్స్, సెక్యూరిటీ ఏజెన్సీలు, టెలికమ్యూనికేషన్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ముందు జాగ్రత్త  చర్యల్లో భాగంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులకు ఆకర్షణీయ ప్యాకేజీలతో ఆహ్వానం పలుకుతున్నాయి. విదేశాలతో పోల్చుకుంటే మనదేశంలో వేతనాలు తక్కువగానే అందుతున్నాయి. బిగినర్స్ సరాసరిన రూ.5.5 లక్షల ప్యాకేజీ పొందుతుండగా ఎక్స్‌‌పీరియన్స్‌‌డ్ పర్సనల్స్ 12 నుంచి 15 లక్షలు అందుకుంటున్నారు.