ఏటూరునాగారం, వెలుగు : ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలను ఐటీడీఏ ద్వారా, ఆదివాసీలతోనే భర్తీ చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి, ఆదివాసీ నిరుద్యోగ సమితి, ఆదివాసీ సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏను ముట్టడించారు.
ఈ సందర్భంగా మైపతి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఆదివాసీలకు దక్కాల్సిన ఉద్యోగాలను మైదాన ప్రాంత వాసులతో భర్తీ చేయడం వల్ల ఆదివాసీ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు.
ఐటీడీఏ పరిధిలోని జీవో 57 ప్రకారం నియామకాలు చేపట్టాలని ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు ఇక్కడే జరగాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం Aపీవో అంకిత్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలొ సిద్దబోయిన రమేశ్, వజ్జరాజు, యెట్టి వేణుగోపాల్, చింత, కార్తీక్, గోంది అశోక్, మద్దెల రాజశేఖర్ పాల్గొన్నారు.