ములుగు, వెలుగు : ఆశ్రమ పాఠశాలల్లో స్టూడెంట్లకు మౌలిక వసతులు కల్పించాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్ ఆదేశించారు. ములుగు మండలం రాయినిగూడెంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు.
స్కూల్‌లో చేరిన రిపేర్లు, విద్యార్థుల బోధన అంశాలు, అటెండెన్స్‌ను పరిశీలించారు. డ్యూటీలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నీటిని వృథా చేయొద్దని, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సూచించారు. టెన్త్ స్టూడెంట్లు మంచి ఫలితాలు సాధించాలని చెప్పారు.