ఏరియా ఆస్పత్రిగా ఏటూరునాగారం సీహెచ్​సీ

ఏరియా ఆస్పత్రిగా ఏటూరునాగారం సీహెచ్​సీ
  • 30 నుంచి 50 పడకలకు పెంపు

ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారంలోని 30 పడకల సామాజిక ఆస్పత్రిని 50 పడకల ఏరియా ఆస్పత్రిగా అప్​గ్రేడ్​ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న ఏటూరునాగారం కమ్యూనిటీ హెల్త్​సెంటర్​ను 30 పడకల నుంచి 50 పడకలకు అప్​గ్రేడ్​ చేయాలని గతంలో పలుమార్లు ప్రభుత్వాన్ని స్థానిక లీడర్లు అభ్యర్ధించారు.

 ఈ క్రమంలో మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో రాష్ట్ర హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్పస్త్రర్​ సెక్రెటరీ క్రిస్టియాన జడ్​చోంగ్తు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ  చేశారు. ఆస్పత్రిని అప్​గ్రేడ్​ చేయడానికి సివిల్​వర్క్స్, పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం రూ.22 కోట్లను కేటాయిచింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చిటమట రఘు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేసి ఏటూరునాగారం మండల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతున్న మంత్రి సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.