వారోత్సవాలకు ముందురోజే..మావోయిస్టులకు ఎదురుదెబ్బ

  • ఏటూరునాగారంలో ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌..తుడిచిపెట్టుకుపోయిన భద్రు దళం 
  • నేటి నుంచి 8 వరకు పీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఏ వారోత్సవాలు
  • భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో తిరుగుతున్న మావోయిస్టులు
  • విషయం తెలిసి కూంబింగ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించిన పోలీసులు
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్‌‌‌‌‌‌‌‌, ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : పీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఏ వారోత్సవాలకు ఒక్క రోజు ముందు మావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. గోదావరి పరివాహక ప్రాంతంలో తిరుగుతున్న భద్రు దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో మావోయిస్టు పార్టీలో అలజడి స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యింది. 

మావోయిస్టులు ప్రతికార చర్యలకు పూనుకునే అవకాశం ఉండడంతో పోలీస్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ హైఅలర్ట్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచే వరంగల్‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అటవీ గ్రామాలను జల్లెడ పడుతూ, అనుమానం ఉన్న వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. 

నేటి నుంచి పీఎల్‌‌‌‌‌‌‌‌జీఏ వారోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి 8వ తేదీ వరకు పీఎల్‌‌‌‌‌‌‌‌జీఏ 24వ వార్షికోత్సవాలను జరుపుకోవాలని మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు కరపత్రాలను రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఒకప్పటి పీపుల్స్‌‌‌‌‌‌‌‌ పార్టీలో పనిచేసిన కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి అలియాస్‌‌‌‌‌‌‌‌ శ్యామ్‌‌‌‌‌‌‌‌, ఎర్రంరెడ్డి సంతోశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి అలియాస్‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌, ఉత్తర తెలంగాణ కార్యదర్శి శీలం నరేశ్‌‌‌‌‌‌‌‌ 1999 డిసెంబర్ 2న ప్రస్తుత భూపాలపల్లి జిల్లా మల్హర్‌‌‌‌‌‌‌‌ మండలం కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో చనిపోయారు. 

ముగ్గురు అగ్రనేతలు ఒకే ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో చనిపోవడంతో వారి పోరాటానికి చిహ్నంగా 2000 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 2 పీఎల్‌‌‌‌‌‌‌‌జీఏ (పీపుల్స్​లిబరేషన్‌‌‌‌‌‌‌‌ గెరిల్లా ఆర్మీ)ని ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ మండలం బేగంపేటలో 2004 నవంబర్ 13న స్మారక స్థూపాన్ని నిర్మించి కుటుంబసభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో పీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఏ 24వ వార్షికోత్సవాలను ఘనంగా జరపాలని పార్టీ శ్రేణులు, కమిటీలు, ప్రజలకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో తిరుగుతున్న మావోయిస్టులు

పీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఏ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు కొత్తగా దళ సభ్యులను రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేసుకునే ఉద్దేశంతో భద్రూ దళం గత కొన్ని రోజులుగా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సంచరిస్తోంది. అటవీ గ్రామాల్లో పర్యటిస్తూ యువతను ఆకట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ములుగు జిల్లా పోలీసులు మాటువేసి భద్రూ దళాన్ని పూర్తిగా తుడిచిపెట్టినట్లుగా అటవీ గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22న ఉయిక రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉయిక అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే ఇద్దరు ఆదివాసీ గిరిజనులను మావోయిస్టులు కొట్టి చంపారు. 

దీంతో ఆదివాసీ ప్రజల నుంచి మావోయిస్టు పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీనిని అవకాశంగా తీసుకున్న పోలీసులు మావోయిస్టు దళం గురించి సమాచారాన్ని ఈజీగా సేకరించి పీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఏ వారోత్సవాలకు ఒక రోజు ముందే ఎదురుదెబ్బ తీశారు. ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో దళ కమాండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భద్రుతో పాటు మరో ఆరుగురు చనిపోవడంతో దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

వరంగల్‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లాలో హైఅలర్ట్‌‌‌‌‌‌‌‌

ములుగు జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందడంతో వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం హైఅలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. దెబ్బతిన్న మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాల్లోని పోలీసులంతా ఆయా స్టేషన్ల పరిధిలో ఇన్‌‌‌‌‌‌‌‌ఫార్మర్‌‌‌‌‌‌‌‌ వ్యవస్థను అలర్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోని రాష్ట్ర సరిహద్దు పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్లకు భారీ భద్రత కల్పించారు. అడవుల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించి కూంబింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 

ఇంటలిజెన్స్‌‌‌‌‌‌‌‌ వర్గాలను అప్రమత్తం చేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గ్రామాల్లో వెహికల్‌‌‌‌‌‌‌‌ చెకింగ్‌‌‌‌‌‌‌‌లను ముమ్మరం చేశారు. కొత్త వ్యక్తులు కనబడితే అదుపులోకి తీసుకొని విచారించి వదిలేస్తున్నారు. ముఖ్యంగా చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ నుంచి వలస వచ్చి నివాసం ఉంటున్న గొత్తికోయలపై నిఘా పెట్టి గూడేలను తనిఖీ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.