
పెట్రోల్, డీజిల్ కార్లపై బ్యాన్ విధిస్తూ సంచలన నిర్ణయం ప్రకటించింది యూరప్ సంచలన నిర్ణయం ప్రకటించింది.. 2035 తర్వాత పెట్రోల్ డీజిల్ కార్లపై నిషేధం విధిస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది యూరోప్ ప్రభుత్వం. వాస్తవానికి ఈ ప్రతిపాదన చాలాకాలంగా ఉంది.. ఇందుకు సంబంధించిన మొట్టమొదటి ‘ఫిట్ ఫర్ 55’ప్యాకేజీపై ఈయూ ప్రతినిధులు గతంలోనే అంగీకారానికి వచ్చారు. ఈ దశాబ్దం చివరికల్లా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 55శాతం మేర తగ్గించడమే ఈ ప్యాకేజీ ఉద్దేశం.
ఈ క్రమంలో.. కార్లు, వ్యాన్లు వంటి పెట్రోల్ డీజిల్ ఆధారిత వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని 2030 నాటికి 55 శాతానికి తగ్గించాలని.. 2035 నాటికల్లా 100శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు ఈయూ పార్లమెంట్, సభ్యత్వ దేశాలు ఆమోదం తెలపడంతో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లయ్యింది. 2050 నాటికి వాయు కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంది యూరప్.
అయితే.. హైడ్రోజన్ వంటి కార్బన్ న్యూట్రల్ కార్లకు బ్యాన్ నుంచి మినహాయింపులు ఉన్నట్లు తెలుస్తోంది. యూరప్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది ఆసక్తిగా మారింది.