
యూరప్ సహా అన్ని దేశాలపై టారిఫ్ బాంబులు వేసిన ట్రంప్‌కు యూరోపియన్ యూనియన్ (ఈయూ) కూడా బుధవారం ఝలక్ ఇచ్చింది. అమెరికా నుంచి వచ్చే సోయాబీన్, మోటార్ సైకిల్స్, బ్యూటీ ప్రొడక్టులపై 20 బిలియన్ యూరోలకుపైగా విలువైన టారిఫ్‌లు విధిస్తున్నట్టు యూరోపియన్ కమిషన్ ప్రకటించింది. అయితే, అమెరికా న్యాయమైన, సముచితమైన రీతిలో టారిఫ్‌లను తగ్గించుకుంటే.. ఈ టారిఫ్‌లను తాము కూడా రద్దు చేస్తామని వెల్లడించింది. అయితే, అమెరికా ఇదివరకే స్టీల్, అల్యూమినియంపై ప్రకటించిన టారిఫ్ లకు ప్రతీకారంగా ఈయూ తాజా సుంకాలను ప్రకటించింది. కానీ, ట్రంప్ ప్రకటించిన తాజా టారిఫ్‌లకు కూడా యూరోపియన్ కమిషన్ ప్రతీకార సుంకాలు విధిస్తుందా..? లేదా..? అనేది మాత్రం ఇంకా వెల్లడికాలేదు.