
అమెరికానుంచి దిగుమతులపై సుంకాలు పెంచేందుకు రెడీ అయింది యూరప్. ఏప్రిల్ నుంచి అమెరికన్ వస్తువులపై ప్రతీకార సుంకాలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అమెరికా ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను 25శాతం పెంచడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని..ఎవరి ప్రయోజనాల కోసం అధిక సుంకాలను పరిగణించలేమని యూరప్ బుధవారం (మార్చి12) తెలిపారు.
ALSO READ | అమెరికా లిక్కర్ పై 150 శాతం ట్యాక్స్ వేసిన మోడీ: వైట్ హౌస్కు దిమ్మతిరిగే షాక్
ట్రంప్ సుంకాల మినహాయింపుగడువు ఈ రో జుతో ముగిసింది.. దీతో ఉక్కు ,అల్యూమినియం దిగుమతులపై 25శాతం పెంచిన సుంకాలు అమల్లోకి వచ్చాయి .దీంతో యూరప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుEU కార్యనిర్వహణ అధికారి తెలిపారు. ఏప్రిల్ 1న అమెరికా ఉత్పత్తులపై సుంకాలను నిలిపివేత, ఏప్రిల్ 13 నాటికి దాని సుంకాలు పూర్తిగా అమల్లోకి వస్తాయని యూరోపియన్ కమిషన్ తెలిపింది. ఇది EU కస్టమర్లు, వ్యాపారాన్ని రక్షించుకునే చర్యగా తెలిపింది.
అమెరికా సుంకాల పెంపు దాదాపు 18 బిలియన్ యూరోల వస్తువులను ప్రభావితం చేస్తాయి. యూఎస్ పెంచిన సుంకాలకు అనుగుణంగా EU సుంకాలుంటాయని యూరోపియన్ కమిషన్ తెలిపింది.