ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ యూరోకు ఎంతో క్రేజ్ ఉంది. నాలుగేళ్ళకొకసారి జరిగే ఈ టోర్నీ గెలవడానికి ఫుట్ బాల్ దేశాలు తెగ పోరాడతాయి. గత నెలలో ప్రారంభమైన ఈ టోర్నీకి మరికొన్ని రోజుల్లో శుభం కార్డు పడనుంది. 24 జట్లతో ప్రారంభమైన ఈ టోర్నీలో 4 జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందులో భాగంగా నేటి నుంచి సెమీస్ సమరం ప్రారంభం కానుంది.
ఫ్రాన్స్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్ లలో ఒక జట్టు యూరో 2024 ఛాంపియన్ గా నిలవబోతుంది. తొలి సెమీస్ లో ఫ్రాన్స్ స్పెయిన్ తో తలబడుతుంది. ఈ మ్యాచ్ బుధవారం రాత్రి (జూలై 10) 12:30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ తో నెదర్లాండ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ గురువారం (జూలై 11) 12:30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది.
లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
యూరో 2024 సెమీ-ఫైనల్ మ్యాచ్ లు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. SonyLiv యాప్, వెబ్‌సైట్‌లో ఈ మ్యాచ్ లను చూడవచ్చు.
The EURO 2024 Semi-Finals are set 😍🔥 pic.twitter.com/BejiXR3a5l
— OneFootball (@OneFootball) July 6, 2024