T20 World Cup 2024: నేటి నుంచే యూరో కప్ సమరం.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

T20 World Cup 2024: నేటి నుంచే యూరో కప్ సమరం.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

ప్రస్తుతం క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న క్రీడా అభిమానులకు ఫుట్ బాల్ కిక్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ కార్నివాల్ UEFA EURO 2024 లీగ్ నేటి (జూన్ 14) నుంచి ప్రారంభమవుతుంది. జులై 14 వరకు  ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం 24 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ట్రోఫీ చేజిక్కించుకుంటే నాలుగేళ్ల పాటు యూరప్ రాజులుగా చలామణి అవ్వొచ్చు. అందుకే ఈ టోర్నీకి ప్రత్యేక గుర్తింపు. అంతేకాదు, బహుమతిగా అందించే ట్రోఫీని స్వచ్ఛమైన వెండితో తయారు చేస్తారు. దీని బరువు దాదాపు 8 కిలోలు. 

యూరో 2024 17వ ఎడిషన్‌ జర్మనీ వేదికగా జరగనుంది. 1989లో పునరేకీకరణ తర్వాత జర్మనీ తొలిసారిగా ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. మొత్తం 24 జట్లు పాల్గొంటున్నాయి. ఒక్కో గ్రూపులో నాలుగు జట్ల చొప్పున ఆరు గ్రూపులుగా విభజించారు. స్కాట్లాండ్, హంగేరి, స్విట్జర్లాండ్‌లతో కలిసి ఆతిథ్య దేశంలో గ్రూప్ ఏలో ఉండగా.. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇటలీ, మాజీ ఛాంపియన్‌ స్పెయిన్, ప్రపంచ నెంబర్ .10 టీమ్ క్రొయేషియా, అల్బేనియాలతో గ్రూప్ బీలో అత్యంత బలంగా కనిపిస్తోంది. 

మొదట ఒక గ్రూప్‌లోని జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. తద్వారా ఆయా గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు రౌండ్ 16 నాకౌట్ మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాయి. అనంతరం క్వాటర్‌ఫైనల్స్, సెమీఫైనల్స్ జరగనుండగా.. జూలై 14న ఫైనల్‌ తుది సమరం జరగనుంది. 2021లో జరిగిన మునుపటి ఎడిషన్ లో ఇంగ్లండ్‌ను ఓడించిన డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఇటలీ నిలిచింది.

గ్రూప్ ఏ: జర్మనీ, స్కాట్లాండ్, హంగేరి, స్విట్జర్లాండ్   
గ్రూప్ బి: స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ, అల్బేనియా
గ్రూప్ సి: స్లోవేనియా, డెన్మార్క్, సెర్బియా, ఇంగ్లండ్     
గ్రూప్ డి: పోలాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఫ్రాన్స్
గ్రూప్ ఈ: బెల్జియం, స్లోవేకియా, రొమేనియా, ఉక్రెయిన్
గ్రూప్ ఎఫ్: టర్కీ, జార్జియా, పోర్చుగల్,  చెక్ రిపబ్లిక్

లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

భారతీయ ఫుట్‌బాల్ ప్రేమికులు యూరో 2024 ప్రత్యక్ష ప్రసారాలను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో టీవీలో చూడవచ్చు. అలాగే, డిజిటల్ గా సోనీలివ్ యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారాలు ఆస్వాదించవచ్చు. 

వేదికలు

యూరోపియన్ ఛాంపియన్‌షిప్ 17వ ఎడిషన్‌కు 10 వేదికలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. జర్మనీ- స్కాట్లాండ్ మధ్య జరిగే ఆరంభ మ్యాచ్ మ్యూనిచ్‌లోని అలియాంజ్ అరేనా వేదికగా జరగనుంది. ఫైనల్ పోరుకు జర్మనీ రాజధాని నగరం బెర్లిన్‌లోని ఒలింపియా స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.

-బెర్లిన్: ఒలింపియా స్టేడియన్ బెర్లిన్
-కొలోన్: కొలోన్ స్టేడియం (రీన్ ఎనర్జీస్టేడియన్)
-డార్ట్మండ్: BVB స్టేడియన్ డార్ట్మండ్ (సిగ్నల్ ఇడునా పార్క్)
-డ్యూసెల్‌డార్ఫ్ - డ్యూసెల్‌డార్ఫ్ అరేనా (మెర్కుర్ స్పీల్-అరేనా)
-ఫ్రాంక్‌ఫర్ట్: ఫ్రాంక్‌ఫర్ట్ అరేనా (డ్యూయిష్ బ్యాంక్ పార్క్)
-గెల్సెన్‌కిర్చెన్:  అరేనా ఔఫ్‌షాల్కే (వెల్టిన్స్-అరేనా)
-హాంబర్గ్: వోక్స్‌పార్క్‌స్టేడియన్ హాంబర్గ్
-లీప్జిగ్: లీప్జిగ్ స్టేడియం (రెడ్ బుల్ అరేనా)
-మ్యూనిచ్: మ్యూనిచ్ ఫుట్‌బాల్ అరేనా (అలియాంజ్ అరేనా)
-స్టట్‌గార్ట్: స్టట్‌గార్ట్ అరేనా (ఎంహెచ్పీ అరేనా)